అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల పాటు భార‌త్‌లో ప‌ర్య‌టించ‌డం, దాన్ని భార‌తీయ‌-అంత‌ర్జాతీయ మీడియా ఓ రేంజ్‌లో క‌వ‌ర్ చేయ‌డం తెలిసిన సంగ‌తే. టూర్ అనంత‌రం  భారత్‌ను అద్భుతమైన దేశంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొనియాడారు. తన పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయ పురోగతి నమోదైందని చెప్పారు.అయితే, ఆ వెంట‌నే అగ్ర‌రాజ్యం విష‌యంలో భార‌త్ ట్రంప్‌కు స‌హాయం చేసింది. ఖ‌తార్‌లోని దోహాలో అమెరికా, తాలిబ‌న్ మ‌ధ్య ఇవాళ శాంతి ఒప్పందం జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్‌కు భార‌త్ హాజ‌రు అవుతోంది. స‌హ‌జంగానే అమెరికా త‌ర‌ఫున భార‌త్ గ‌ళం వినిపించ‌నుంది. దీంతో భార‌త్ వంటి బ‌ల‌మైన దేశం అండ అమెరికాకు క‌లిసివ‌చ్చే అంశ‌మే.

 


ప్ర‌స్తుతం ఆప్ఘ‌నిస్తాన్‌లో రాజ‌కీయ అనిశ్చితి నెల‌కొంది. దాన్ని స‌ద్దుమ‌ణిగించేందుకు దోహాలో స‌మావేశం అవుతున్నారు.  సుమారు 30 దేశాల ప్ర‌తినిధులు సంత‌కాల ఒప్పందానికి హాజ‌రుకానున్నారు.  అయితే, జ‌రిగే సంత‌కాల ఒప్పందానికి ఆఫ్ఘ‌నిస్తాన్ హాజ‌రుకావ‌డం లేదు! అయితే తాలిబ‌న్‌తో అమెరికా ఎటువంటి ఒప్పందానికి అంగీకరించిందో ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. ఆ డీల్‌లో ఉన్న ష‌ర‌తుల గురించి ఎటువంటి ప‌బ్లిక్ ప్ర‌క‌ట‌న జ‌ర‌గ‌లేదు. మ‌రోవైపు ఈ ఒప్పందంతో.. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉన్న వేలాది మంది అమెరికా సైనికులు ఉప‌సంహ‌రించుకోనున్నారు. దీంతో ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ద‌శాబ్ధాలుగా ఉన్న హింసాత్మ‌క వాతావ‌ర‌ణానికి బ్రేక్ ప‌డ‌నుంది. 

 

కాగా, ఈ కీల‌క ఒప్పందానికి  ముందు...సకుటుంబ సమేతంగా మంగళ, బుధవారాల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌ అద్భుత దేశమని ప్రశంసించారు. మోదీ గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడని కొనియాడారు. తమకు అద్భుతమైన ఆతిథ్యం లభించిందన్నారు. తన పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయ పురోగతి నమోదైందని, రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం అత్యద్భుతంగా ఉన్నాయన్నారు. భారత్‌తో పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని నిర్వహించనున్నామని, వారు (భారత్‌) ప్రస్తుతం వందల కోట్ల డాలర్లను అమెరికాకు పంపుతున్నారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: