సోషల్ మీడియా .. వల్ల ఎన్నో లాభాలు ప్రజలకు కలిగిన కూడా ఏదొక చోట నష్టం కూడా జరిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా జరిగే విషయాలను సెకన్లలో తెలిసిపోతుంది.. అలాంటి సోషల్ మీడియాలో ఈ మధ్య పిచ్చి ప్రేమలో పడటం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన  కాస్త చాటింగ్ వరకు వెళ్లి చివరికి చావు వరకు వెళ్ళింది. 

 

 

అసలు విషయానికొస్తే.. ఫేస్ బుక్ చాటింగ్ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఫేస్‌బుక్‌ చాటింగ్‌.. ఒకరి హత్య.. మరొకరి ఆత్మహత్యకు కారణమైంది. గద్వాల పట్టణానికి చెందిన వివాహిత సుధారాణికి కార్తీక్ కొన్ని నెలల క్రితం ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇదే సందర్భంలో ఫేస్‌ బుక్‌ ద్వారా మరో వ్యక్తి రవి సుధారాణికి పరిచయం అయ్యాడు. 

 

 


అలా ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధం పెట్టుకునేలా చేసింది. ఈ క్రమంలో కార్తీక్‌ సుధారాణిని డబ్బుల కోసం వేధిస్తున్నట్లు తెలిసింది.ఏమైందో తెలియదు కానీ, అతను కొద్దీ రోజుల తర్వాత అతను ఓ నిర్మానుష్య ప్రదేశంలో శవమై కనిపించాడు.. అతి దారుణంగా నరికి చంపి పూడ్చి పెట్టారు. అతన్నీ ఆమె సోదరుడితో పాటుగా మరో ఇద్దరు కలిసి చంపినట్లు తెలుస్తోంది. మొత్తానికి దారుణంగా జరిగిన ఘటన కలకలం రేపింది. 

 

 


ఇకపోతే సుధారాణి కూడా చనిపోయిది.  మరణ వార్త వినగానే ఆమె ఉరివేసుకొని మరి హత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాలు నమ్మొద్దు అని ఈ సందర్బంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ దారుణ ఘటన ఇప్పుడు మహబూబ్ నగర్ ను తీవ్ర విషాదంలోకి పడేసింది. ఇంకా పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: