2018 మిర్యాలగూడలో చోటుచేసుకున్న ప్రణయ్ అమృత పరువుహత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. కుల వివక్షతో కూతురు అమృత భర్త ప్రణయ్ ను అత్యంత దారుణంగా నడిరోడ్డుపై హత్య చేయించాడు తండ్రి మారుతీ రావు. దీంతో అప్పట్లో ప్రణయ్ హత్య కేసు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. 

 

ఆతర్వాత ప్రణయ్ ను అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి చంపించాడు అని తేలడంతో ఈ కేసు అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే ఈ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ రాగా. వాళ్ళు ముగ్గురు ప్రస్తుతం బయటే ఉన్నారు. కాగా ప్రణయ్ చనిపోయిన తర్వాత అమృత అత్తవారింట్లోనే ఉంటుంది. 

 

అయితే ఆ సమయంలో రాజకీయనాయకులు కూడా ప్రణయ్ హత్యను క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. అప్పట్లో అమృత రాజకీయాల్లోకి వస్తుంది అని కూడా వార్తలు వచ్చి హాల్ చల్ చేశాయి అయితే అందులో నిజం లేకపోయింది. ఇంకా తండ్రి మారుతీరావు కూడా బయటకు వచ్చిన సమయం నుండి కూతురు అమృతను మళ్లీ పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చెయ్యడంతో తండ్రి మారుతీ రావుపై ఆమె కేసు కూడా పెట్టింది. 

 

ఆ తర్వాత అమృతకు వేధింపులు అని వార్తల్లో అప్పుడప్పుడు కనిపించినప్పటికీ ఆ సమయంలో మీడియాలో ఆ వార్తలు హాల్ చల్ చేసినప్పటికీ మళ్లీ ఆ వార్తలు ఎక్కడ కనిపించవు. ఇక ఈ నేపథ్యంలోనే అమృతకు సంబంధించి అంత సైలెంట్ గా ఉంది అనుకున్న సమయంలో అమృత భర్త ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు షెడ్‌లో ఓ మృతదేహం లభించింది. 

 

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మారుతీరావు నివాసంలో మృతదేహం కలకలం రేపుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మారుతీరావు షెడ్‌లో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఆ శవం ఎవరిది? అక్కడ ఎందుకు ఉంది? అది హత్య లేక ఆత్మహత్య? హత్య అయితే ఎవరు చేశారు? అన్న ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: