తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక మున్సిపల్ ఎన్నికలు ముగిసిన అనంతరం... సహకార సంఘాల ఎన్నికలు తెలంగాణా లో జరిగాయి. ఇకపోతే తాజాగా సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీలో ఓ కొత్త చర్చ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో పలు చైర్మన్ స్థానాలను అధికార పార్టీ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ కోరిన విషయం తెలిసిందే. ఇక ఎంఐఎం పార్టీ కి మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు టిఆర్ఎస్ పార్టీ అంగీకరించకపోవడంతో.. ఎంఐఎం పార్టీ కాస్త వెనకడుగు వేసినట్లు అప్పట్లో సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. 

 

 

 ఇక మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే వచ్చిన సహకార సంఘాల ఎన్నికల్లో... మైనార్టీలకు ఒక డిసిసిబి చైర్మన్ స్థానాన్ని కట్టబెట్టాలని పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ... టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. అయితే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పెట్టిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికార పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే దీనికి మరో కారణం కూడా ఉంది అంటూ  టిఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

 

 

 పాలమూరు జిల్లాలో  నేతల మధ్య ఉన్న అధికార పోరు కూడా... ఇందుకు కారణం అయింది అంటూ చెబుతున్నారు. అయితే పాలమూరు లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి లు తమ అనుచరులకే   డిసిసిబి చైర్మన్ పదవిని కట్టబెట్టాలి అంటూ పట్టుబట్టడంతో నే... ఆ ఇద్దరికీ కాకుండా మరో వ్యక్తికి డిసిసిబి చైర్మన్ పదవిని... ముఖ్యమంత్రి కెసిఆర్ కట్టబెట్టారు అని ప్రస్తుతం అధికార పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే డిసిసిబి పదవిని దక్కించుకున్న నిజాం పాషా... కాంగ్రెస్ పార్టీతో సుధీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒక్కసారిగా డీసీసీబీ  పదవి దక్కకపోవడంతో ప్రస్తుతం అధికార పార్టీలో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. తమ జిల్లా పరిధిలో మంత్రులు ఆధిపత్యం కోసం ఎన్ని పాములు కదిపినప్పటికీ... పార్టీ హైకమాండ్ మాత్రం వారికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: