ఏ చిన్న విషయం వచ్చినా సరే మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మీడియా ఎక్కువగా ప్రతీ అంశాన్ని పెద్దది చేసి చూస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ అంశాలు సామాజిక అంశాలు ఇలా ఏది చూసినా సరే మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తూ రేటింగ్ పొందే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ వారం మీడియా ఫోకస్ చేసిన అంశాల పరంగా చూస్తే... ఢిల్లీ అల్లర్లను జాతీయ మీడియా లోకల్ మీడియా ఎక్కువగా ఫోకస్ చేసాయి అని చెప్పవచ్చు. 

 

ఈశాన్య ఢిల్లీ లో జరిగిన అల్లర్లు హింసను ప్రేరేపించాడంతో వందల మంది గాయపడ్డారు. అలాగే దాదాపు 50 మంది వరకు మరణించారు. రాజకీయ కక్షలు కూడా దీనికి తోడు కావడంతో పరిస్థితి హింసా రూపం దాల్చింది. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఢిల్లీ లో ఇది తీవ్ర రూపం దాల్చింది అనే చెప్పాలి. దీనిపై ఎక్కువగా మీడియా ఫోకస్ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విశాఖ అంశాన్ని ఎక్కువగా ఫోకస్ చేసింది. చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు వెళ్ళగా...

 

అక్కడ వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీని మీద మీడియా ఎక్కువగా చర్చలు జరిపింది. ఇది జాతీయ మీడియా కూడా ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇక కరోనా విషయాన్ని కూడా మీడియా ఎక్కువగా ఫోకస్ చేసింది. కరోనా వైరస్ తీవ్రత పెరగడంతో దీని మీద కూడా మీడియా ఎక్కువగా ఫోకస్ చేసింది. ముఖ్యంగా చైనా వరకు మాత్రమే పరిమితం అయిన ఈ వైరస్ ఎక్కువగా ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. దీనితో ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన ను ఎక్కువగా మీడియా ఫోకస్ చేసింది. ట్రంప్ గురించి ప్రతీ విశేషాన్ని మీడియా హైలెట్ చేసింది. ఈ వారం దాదాపు అన్ని చానల్స్ దాన్ని కవర్ చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: