ఆ ఛానెల్ లో ప్రచారం అయ్యే న్యూస్ కంటే ఆ వార్తలకు ముందు చెప్పే కొటేషన్స్ చాలా పాపులర్. సమాజం మీద, ఈ వ్యవస్థ మీద వారికి తప్ప మిగతా ఎవ్వరికీ బాధ్యతలు లేవని, తాము మెరుగైన సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పే ఓ అగ్ర శ్రేణి కార్పొరేట్ మీడియా వ్యవహారం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రవేశిస్తున్న తొలినాళ్లలో పురుడు పోసుకున్న సదరు ఛానెల్ అప్పటి నుంచి బాగా పాపులర్ అయ్యింది. జర్నలిజానికే కొత్త అర్ధం చెబుతూ .. కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఆ ఛానెల్ వ్యవహారం కొద్ది రోజులుగా వివాదాస్పదం అవుతూ వస్తోంది.  


సదరు ఛానెల్ యాజమాన్యం మారి కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో ఇప్పుడు పక్కా వ్య్వపరశైలికి దిగిపోయారు. సంస్థలో పనిచేసే సిబ్బందికి ఇప్పుడు చుక్కలు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడడం వివాదాస్పదం అవుతోంది. మీకు రెండు నెలల గడువు ఇస్తున్నాం ..! ఛానెల్ కి కనుక లాభాలు రాకపోతే ఇక మీ పని అంతే.. ఇప్పుడున్న వారిలో మూడు వంతుల మంది ఇంటికి వెళ్ళిపోతారు జాగ్రత్తగా అంటూ హెచ్చరికలతో కూడిన బెదిరింపులు చేస్తూ సదరు మెరుగైన చానల్ బోర్డ్ మీటింగ్‌లో సిబ్బందికి సదరు కార్పొరేట్ యాజమాన్యం చెప్పిన చేదైన.. బరువైన మాట. దీంతో ఒక్కసారిగా ఆ ఛానెల్ సిబ్బందిలో ఒక్కటే టెన్షన్. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మా పరిస్థితి ఏంటి ? అని. 

IHG


ఆ మెరుగైన ఛానెల్ గతంలో బాగానే ఉన్నా ఇప్పుడు వ్యాపారాల్లోనూ, వ్యవహారాల్లోనూ బాగా ఆరితేరిపోయిన ఓ విజయవంతమైన రియల్ ఎస్టేట్ యాజమాన్యం చేతుల్లో పడడంతో అదే రేంజ్ లో ఉద్యోగులకు కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇస్తూ మెంటల్ ఎక్కిస్తున్నారు. మీడియా అంటే అది కూడా రియల్ ఎస్టేట్ వలే లాభాలు మాత్రమే కావలి నష్టాలు వస్తే ఊరుకునేది లేదు అన్నట్టుగా సదరు సంస్థ యాజమాన్యం అవలంబించడంతో వారంతా ఇప్పుడు లబోదిబో అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సగం మందిని తప్పించాలనే ఉద్దేశంతో ఉన్న ఆ ఛానెల్ యాజమాన్యం ఇప్పుడు ఇలా కుంటి సాకులు చెబుతున్నట్టుగా ఉద్యోగులు అనుమానిస్తున్నారు. 


పాత యాజమాన్యం ఉండగా సదరు ఛానెల్ లోనూ ఉద్యోగుల్లోనూ మంచి హుషారు ఉండేదని, ప్రొఫెషనల్ గా సంస్థను నడిపిస్తూ వారు ఉద్యోగులకు స్వేచ్ఛను కల్పించడంతో సంస్థ తమదే అన్నట్టుగా ఎవరికి వారు కష్టపడుతూ ఉండేవారట. దాంతో సంతకు కూడా నెలకు పదిహేను కోట్ల వరకూ లాభం వచ్చేదట. కానీ ఇప్పుడు యాజమాన్యం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంతో లాభాల్లో కోతే కాదు, ఉద్యోగుల్లోనూ తీవ్ర అసంతృప్తి రేగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సంస్థలో తీసివేతలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, లాభ నష్టాలకు ఉద్యోగులను బాధ్యులను చేయడంపై ఆ కార్పొరేట్ మీడియా యాజమాన్యంపై ఆ సంస్థ సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సిబ్బంది విషయంలో ఇలా కఠినంగా ఉన్న ఆ మెరుగైన యాజమాన్యం ముందు ముందు ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: