తెలంగాణా రాజకీయాలు ఇప్పుడు ఎక్కువగా రాజ్యసభ సీట్ల చుట్టూ తిరుగుతున్నాయి. మార్చ్ నెలలో రెండు స్థానాలు ఖాళీ అవుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవరిని రాజ్యసభకు పంపిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని అంటున్నారు. లేదు ఆమెను మంత్రిని చేసే అవకాశం ఉందనే చర్చ కూడా ఎక్కువగానే జరిగింది. ఆమె కాదు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నాయి అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. 

 

ఆ తర్వాత ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పంపించి ఆ తర్వాత కవితకు మంత్రి పదవి ఇస్తారు అనే చర్చ జరిగింది. లేదు కెసిఆర్ రాజ్యసభకు వెళ్లి ఎమ్మెల్యేగా కవిత పోటీ చేస్తారు అంటూ కూడా ఈ వారం చర్చలు ఎక్కువగా జరిగాయి. ఇక తుమ్మల నాగేశ్వరరావు బిజెపిలోకి వెళ్ళే అవకాశం ఉందని కూడా అన్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆయన కొన్నాళ్ళు గా సైలెంట్ గా ఉన్నారు. దీనితో ఆయన్ను బిజెపి ఆహ్వానించింది అంటున్నారు. ఇకపోతే... బ్యాట్మింటన్ క్రీడాకారిణి అయిన పీవీ సింధు బిజెపిలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఆమె తెలంగాణా గవర్నర్ తో శనివారం భేటి అయ్యారు. ఈ నేపధ్యంలో ఆమె తెలంగాణా బిజెపిలో చేరతారని సోషల్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. ఇక రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఆఫర్ ఇచ్చారు అనేది కూడా మీడియా ఎక్కువగా హైలెట్ చేసింది అనే చెప్పాలి. ఆయన బిజెపిలో చేరితే కేంద్ర మంత్రివర్గం లోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా ఈ వారం జరిగింది. తెలంగాణా టీడీపీ ని బిజెపిలో విలీనం చేయడానికి గరికపాటి మోహనరావు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మీడియా కథనాలు వచ్చాయి. ఇలా ఈ వారం తెలంగాణాలో రాజకీయాలు కాస్త హాట్ హాట్ గానే సాగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: