ఈ వారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అహ్మాదబాద్ లో మోతేరా స్టేడియాన్ని ప్రారంభించిన ట్రంప్ అక్కడ ఆకట్టునేలా ప్రసంగించారు. ట్రంపు పర్యటన ఆసాంతం ఇండియా అంతా ఆసక్తిగా గమనించింది. ఆయన తన ప్రసంగంలో ఇండియాను అమాంతం ఆకాశానికెత్తేశారు. ఇదంతా సీరియస్ గా సాగినా.. ఆయన పలికిన కొన్ని తప్పులు చూసేవారికి నవ్వు తప్పించాయి. అనేక సినిమాలను, వ్యక్తుల పేర్లను ట్రంపు తప్పుగా పలికారు.

 

 

ఇక ఏపీ విషయానికి వస్తే.. చంద్రబాబు రాజకీయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వేసే పొలిటికల్ సెటైర్లు భలేగా నవ్వు తెప్పించాయి. పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జివో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమే. ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయట పడకుండా చూసేది. దోపిడీ వ్యవహారాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో వెలుగుచూస్తుంటే కులం, కక్ష అంటూ బట్టలు చించుకుంటున్నాడ అంటూ సెటైర్లు విజయసాయిరెడ్డి పేల్చారు.

 

బాబు కళ్లలో ఆనందం కోసం పచ్చ మీడియా ఏదైనా రాస్తుంది. ఎంగిలి కూడు తిన్న విశ్వాసం కదా! యజమాని, బానిసలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరో ఏడాదిలో ఇక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను అన్ని రాష్ట్రాలూ అనుసరిస్తాయి. సిఎం జగన్ గారి పాలనలో ఏపీ రోల్ మోడల్ అవుతుంది.. అంటూ చంద్రబాబు అనుకూల మీడియాను ఎండగట్టారు. కుప్పం వెళ్లి అన్న క్యాంటీన్లు రద్దు చేశారని వాపోయాడు. పేద వాళ్లకు తిండి దొరకకుండా చేశారట. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల్లో రూ.5 భోజనం కోసం ఎదురుచూసే వాళ్లుండటమేమిటి? కుప్పంలో పేదరికమే లేదని గంటాపథంగా చెప్పాల్సిన వాడివి. ఇంత దీనపు పలుకులు ఏమిటి?. అంటూ నిలదీశారు విజయసాయిరెడ్డి.

 

అంతే కాదు.. చంద్రబాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి. అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయి. ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు చంద్రబాబూ. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను పరిపాలనా రాజధాని చేయాలని సిఎం జగన్ గారు నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరతావా? అంటూ విజయసాయిరెడ్డి కడిగేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: