కరోనా  వైరస్ ప్రస్తుతం ఈ పేరు చెబితేనే ప్రపంచ దేశాలన్నీ గజగజ వణికిపోతున్నాయి.చైనాలో  గుర్తించబడిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రాణాంతకమైన వైరస్ తమ దేశ  పరిధిలోకి వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... వైరస్ వ్యాప్తి చెంది ప్రభావాన్ని చూపిస్తూ ప్రజలందరి ప్రాణ భయంతో వణికి పోతోంది. దీంతో ప్రపంచ దేశాలు కూడా ఈ ప్రాణాంతకమైన వైరస్ కారణంగా ఒణికిపోతూ నే ఉన్నాయి. ఇక చైనా  దేశ పరిస్థితి అయితే ఈ రోజు రోజుకు మరింత అధ్వానంగా మారిపోతుంది. 

 

 

 చైనాలో శరవేగంగా వ్యాప్తిచెందిన కరోనా వైరస్ బారినపడి అధికారికంగా వెల్లడించిన ప్రకారం 2,800 మంది మరణించగా అనధికారికంగా ఈ సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 80 వేల మందికి పైగా ఈ వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇక అటు భారతదేశంలో కూడా ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ కి సంబంధించి మూడు కేసులు నమోదవగా... భారత్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదుకు ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాణాంతకమైన వైరస్ భారతదేశంలో ప్రవేశించకుండా ఉండేందుకు... ఇప్పటికే చైనా దేశంతో సహా పలు దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసింది భారత్. ఇక తాజాగా ఇందులో భాగంగానే ఇరాన్  పౌరులు  భారత దేశంలోకి అడుగు పెట్టకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

 

 

 చైనా దేశం తర్వాత కరోనా  వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుంది ఇరాన్  దేశంలోనే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చైనా దేశానికి విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం తాజాగా  తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఇరాన్ దేశంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు... ఆరువందల మంది కరుణ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే  ఇరాన్ దేశానికి చెందిన పౌరులు భారత్లో అడుగు పెట్టకుండా ఉండేందుకు భారత్ వీసాలను  నిలిపి వేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: