మన పొరుగున ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ కు ఫేస్ బుక్ , గూగుల్ , ట్విట్టర్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు షాక్ ఇచ్చాయి. తమ సర్వీసులు నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చాయి. పాక్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పాయి.

 

 

ఇంతకీ ఈ ఫేస్ బుక్ , గూగుల్ , ట్విట్టర్ లకు పాక్ అంటే ఎందుకు అంత కోపం వచ్చింది.. ? ఎందుకంటే.. సామాజిక మాధ్యమాల నియంత్రణకు పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవల ఓ కొత్త పాలసీ తీసుకొచ్చింది. అనేక కొత్త రూల్స్ పెట్టింది. ఈ రూల్స్ ప్రకారం.. సామాజిక మాధ్యమ సంస్థలు ఏదైనా సమాచారాన్ని లేదా డేటాను దర్యాప్తు సంస్థలు కోరినప్పుడు తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సి ఉంటుంది.

 

 

అంతే కాదు.. ఈ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలితే 50 కోట్ల రూపాయలను జరిమానా విధించాలని కూడా పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే.. ఈ నిబంధనల వల్ల పాక్ లో సేవలు కొనసాగించడం కష్టతరమవుతుందని ఆసియా ఇంటర్నెట్ కోలేషన్ పాక్ ప్రధానికి లేఖ రాసింది. ఏఐసీలో ఫేస్ బుక్ , గూగుల్ , ట్విటర్ సహా మరికొన్ని సంస్థలు ఉన్నాయి.

 

 

కొత్తగా విధించిన నిబంధనలను వెంటనే సమీక్షించని పక్షంలో సేవల్ని నిలిపివేయాల్సి వస్తుందని ఏఐసీ వార్నింగ్ ఇచ్చేసింది. పాకిస్థాన్ రూపొందించిన నిబంధనలు అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. మరి పాక్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: