ఏపిలో ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది.  గత ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి వైసీపీకి పట్టం కట్టారు ఆంధ్రప్రజ.  ఐదేళ్లు అధికారంలో ఉండి ఏపిని బ్రష్టు పట్టించారని అందుకే ప్రజలు టీడీపీని దారుణంగా ఓడించారని అంటున్నారు వైసీపీ నేతలు.  అయితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో దూకుడు పెంచారు.   ఎన్నికల ముందు ప్రజల మద్యకు వెల్లిన సీఎం జగన్ వారికి ఇచ్చిన హామీలు అమలు పరుస్తూ వస్తున్నారు.  పేదల ప్రజలకు అందాల్సిన పథకాలు అందేలా అధికారులను పురమాయిస్తున్నారు. 

 

ఎక్కడ కూడా అవినీతి అన్న పదం వినపడకూడదని ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు.  గతంలో టీడీపీ పాలనలో ప్రజలు ఎంత విసిగిపోయారో అన్న విషయం వైసీపీ నేతలు గమనిస్తూ వారికి అన్ని విధాల సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చేస్తున్నారు.  ఇక పరిపాలన సౌలభ్యం కోసం సీఎం జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.  అయితే ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నారు.  అమరావతికి అన్యాయం చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతే కాదు అక్కడ రైతులు కూడా ఈ విషయంలో వ్యతిరేకిస్తున్నారు.

 

అయితే రైతులను ప్రతిపక్ష నేతలు కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులతో ఇలాంటి దుష్ట కార్యక్రమాలు చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంత కాలంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర వేధికగా చంద్రబాబు, లోకేషన్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.  తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన ఎమ్మెల్సీ పదవి త్వరలోనే పోతుందని అన్నారు. తండ్రి అధికారం పోయింది. ఎమ్మెల్సీ పదవి రేపోమాపో ఊడుతుంది. ఇంకో పక్క అక్రమ సంపాదనల డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్(Psychopath)లా మారిపోయాడు. చీకట్లో కూర్చుని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నాడు. బయటకొచ్చి మాట్లాడు చిట్టీ, నీ కామెడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు' అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: