ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ రెండు భిన్న పరిస్థితులను ఎదుర్కొంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అది పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అనవసరంగా ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి అనేది వాస్తవం. రాజకీయంగా ఆ పార్టీ ఇబ్బంది పడేది వాటితోనే అని స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా జగన్ తీసుకున్న ఇళ్ళ పట్టాల పంపిణి నిర్ణయం పార్టీకి ప్రజలను దూరం చేస్తుంది అనే చెప్పవచ్చు. 

 

ఇక ఈ వారం ఆ పార్టీ ఎం చేసింది అనేది చూస్తే, పలు ప్రాంతాల్లో రాజధాని మూడుగా ఉండాలని, అప్పుడే అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందుతాయని భావిస్తూ ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు కొన్ని సమావేశాలను పార్టీ నేతలు నిర్వహించారు. ఇక విశాఖలో చంద్రబాబు పర్యటనను వైసీపీ సమర్ధవంతంగా అడ్డుకుంది అనేది అర్ధమవుతుంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేసింది ఆ పార్టీ. ఇక రాజ్యసభ సీట్ల విషయానికి వస్తే... 

 

వాటిపై ఎక్కువగానే పార్టీలో ఈ వారం చర్చలు జరిగాయి. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ని రాజ్యసభకు పంపించాలి అనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. అలాగే మోపిదేవి వెంకటరమణను కూడా పంపే విషయమై పార్టీ ఎక్కువగానే చర్చిస్తుంది. ఇలా ఈ వారం పార్టీ పెద్దగా రాజకీయం చేయకపోయినా, విశాఖ చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న విషయంలో భిన్న అభిప్రాయాలను పొందింది. ఎక్కువ మంది అది వైసీపీ చేసిన హడావుడే అనుకున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని చర్చలు జరిపారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయమై ఆయన కీలక నేతలతో చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో ఎలా అయినా విజయం సాధించాలి అనే పట్టుదల పార్టీలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: