ఏపీలో శాసన మండలి వ్యవహారం మరోసారి చర్చకు వస్తోంది. ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేయడంతో ఇప్పుడు శాసన మండలి కొనసాగుతుందా లేక అనే సందేహం అందరిలోనూ ఉంది. మరి కొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతుండడంతో అసెంబ్లీతో పాటు కూడా శాసనమండలిని ఏర్పాటు చేయకపోతే టిడిపి ఏం చేస్తుంది అనేది చర్చకు వస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు బిల్లుల విషయంలో శాసనమండలి చైర్మన్ నియమించిన సెలెక్ట్ కమిటీ వ్యవహారం ఇప్పటికీ ఒక కొలిక్కిరాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో శాసనమండలి వ్యవహారం ఎటు తేలని విషయంగా అస్పష్టంగా ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం గవర్నర్ వరకు వెళ్ళింది. 

 

IHG


ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్ననేపథ్యంలో కేవలం శాసన సభను మాత్రమే నడిపిస్తారా మండలిని కూడా నడిపిస్తారా అనేది చర్చగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం శాసనమండలి రద్దు కాలేదని, కేవలం శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు అని చెబుతోంది. అయితే అధికార పార్టీ మాత్రం మండలిని  రద్దు చేసి తీర్మానాన్ని కేంద్రానికి పంపడంతోనే శాసనమండలి రద్దయినట్టేనని, దానికి ప్రత్యేకంగా సమావేశం అవసరం లేదని వైసిపి చెబుతోంది. అసెంబ్లీ నియమావళి ప్రకారం ప్రోరోగ్ ఆఫ్ ఈచ్ హౌస్ కమెన్స్ ఆఫ్ ఈచ్ హౌస్ కామెంట్స్ ఆఫ్ బీచ్ హౌస్ ఉన్నట్లుగా చెబుతున్నారు. దీని ప్రకారం విడివిడిగా వాయిదా వేయొచ్చు. 


ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభను మాత్రమే నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మండలి సమావేశాలు జరిగితే బడ్జెట్ బిల్లు, మనీ బిల్లు కావడంతో మండలిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉండదు. కానీ కేటాయింపులు మాత్రం మండలిలో తెలుగుదేశం పార్టీ వైసీపీ ఇబ్బందిపెట్టె అవకాశం ఉంది. ఎందుకంటే మండలిలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉండడమే కారణం. దీంతో పాటు సెలెక్ట్ కమిటీ కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా టిడిపి వాడుకునే అవకాశం ఉంది. అందుకే శాసన మండలిని మాత్రమే సమావేశపరచడంపై వైసిపి ఎత్తుగడ వేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో టిడిపి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో వైసీపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: