ఈ మద్య దేశంలో రైలు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. ఏమర పాటున జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంబవిస్తున్నాయి.  దాంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ఎంతో మంది అనాధలుగా, అంగవైకల్యంతో బాధపడుతున్నారు.  తాజాగా ధ్యప్రదేశ్లో రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొనగా.. పంజాబ్ లో ట్రాక్ దాటుతున్న కొందరిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదాల్లో ఐదుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు.  మధ్యప్రదేశ్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో రెండు ట్రాక్ లపై బోగీలు పడటంతో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 

 

పంజాబ్ లోని లూథియానాలో గ్యాస్ పురా ప్రాంతంలో ట్రాక్ దాటుతున్నవారిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ప్రమాదానికి కారణమైన రైలు ఢిల్లీ నుంచి అమృత్ సర్ వెళ్తోందని అధికారులు తెలిపారు.  ఈ రెండూ కూడా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు చెందిన బొగ్గు తరలించే రైళ్లు అని, ఉత్తర ప్రదేశ్ లోని రిషద్ నగర్, మధ్య ప్రదేశ్ లోని అమ్లోరీ మధ్య నడుస్తాయని అధికారులు తెలిపారు.

 

ఖాళీగా వస్తున్న రైలుకు చెందిన ఇంజన్, పదమూడు బోగీలు పట్టాలు తప్పాయని, కొన్ని పూర్తిగా బోల్తా పడ్డాయని వెల్లడించారు. ఇద్దరు రైలు లోకో పైలట్ల (రైలు నడిపేవారు) తో పాటు మరొకరు మరణించారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో గ్యాస్ పురా ప్రాంతంలో రైలు గేటు పడినా కూడా కొందరు ట్రాక్ దాటేందుకు ప్రయత్నించారని, వేగంగా వస్తున్న రైలు వారిని ఢీకొందని చెప్పారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రైలు ప్రమాదం విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.  రైలు ప్రమాదం పై దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: