ట్రంప్ ఇండియా వచ్చి వెళ్లిన తరువాత అమెరికాలో ఇండియా గురించి ఇండియా ఆతిధ్యం గురించి, ఇండియాలో ఆయనకు లభించిన స్వాగతం గురించి మొతేరా స్టేడియంలో జరిగిన సభ గురించి ట్రంప్ టకాటకా మాట్లాడుతున్నారు.  ఇండియాలో సభ చూసిన తరువాత తనకు కలిగిన అనుభవాలను నెమరువేసుకుంటున్నారు.  ఇండియా అంటే తనకు ప్రత్యేకత ఏర్పడింది అని చెప్తూ... ఇండియాలో తనకు లభించిన స్వాగతం జీవితంలో మర్చిపోను అని చెప్తున్నాడు.  


ఇంతవరకు బాగానే ఉంది.  అయితే, ఇండియాలో లక్షల మందిని ఒకేచోట చూసిన తరువాత తనకు ధైర్యం వచ్చిందని, ఎంతమంది ఎదురుగా ఉన్న మాట్లాడగలననే నమ్మకం కలిగిందని అన్నారు.  అమెరికన్ సభల్లో 10 నుంచి 15 వేలమంది మాత్రమే ఉంటారని, కానీ, ఇండియాలో సభల్లో లక్షల మందిని చూసి షాక్ అయినట్టుగా ట్రంప్ అమెరికా వెళ్లిన తరువాత ఇప్పటి వరకు నాలుగైదు సార్లు చెప్పుకొచ్చారు.  


ఇలా చెప్పడం వలన ట్రంప్ పరపతి ఏమో గాని ఇండియా గౌరవం మరింతగా పెరిగింది.  అమెరికా అధ్యక్షుడు ఇండియా గురించి ఇలా పొగుడుతుంటే ఏ దేశానికైనా కావాల్సింది ఏముంటుంది.  ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యం.  తక్కువగా ఇండియా వస్తుంటారు.  అలా వచ్చినపుడు ఇచ్చే ఆతిధ్యం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  ట్రంప్ కు ఇలా స్వాగతం పలికించుకోవడం ఇదే మొదటిసారి కాబట్టి ట్రంప్ కు షాక్ గా ఉండటం సహజమే.  


ఇక ఇదిలా ఉంటె, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాను పొగుడుతూనే వీసాల విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టారు.  వీసా చార్జీలను పెంచారు.  ఇండియా వచ్చినందుకు ఆతిధ్యం ఇస్తే అయన మాత్రం రిటర్న్ గిఫ్ట్ కింద ఇలా చార్జీలు మోతమోగించడం అంటే షాక్ ఇచ్చే అంశమని చెప్పాలి.  షాక్ ల మీద షాకులు ఇచ్చిన ట్రంప్ ఇండియాకు ఎందుకు ఇలా బిస్కెట్లు వేస్తున్నాడో తెలియడం లేదు. ఈ బిస్కేట్స్ కు లోంగే వ్యక్తులు ఎవరూ లేరు అని చెప్పేందుకు ఇలా చేస్తున్నారా అన్నది చూడాల్సిన అంశం.   

మరింత సమాచారం తెలుసుకోండి: