ఆరేళ్ళ తరువాత యూనివర్సిటీలకు పాలకమండళ్లను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో గులాబీ నేతలకు అవకాశం కల్పించింది. అధికార పార్టీకి చెందినవారిని తీసుకోవడంతో విమర్శలు వస్తున్నాయి. అయితే ఇదేమి కొత్త కాదనీ గత ప్రభుత్వాల హయాంలోనూ అధికార పార్టీ నేతలనే ఈసీ సభ్యులుగా నియమించారని చెబుతోంది టీఆర్‌ఎస్.

 

యూనివర్సిటీల్లో పాలకమండళ్ల నియమానికి మోక్షం లభించింది. గవర్నర్ ఆదేశాలతో ఎట్టకేలకు ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిళ్లను నియమించింది ప్రభుత్వం. ఉస్మానియా, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, జేఎన్టీయూ, యూనివర్సిటీల వారీగా జీవోలు విడుదల చేసింది. ఐదుగురు ఎక్స్‌అఫీషియో, నలుగురు ప్రముఖులతో కలిపి మొత్తం తొమ్మిది మందితో పాలకమండలిని ఏర్పాటు చేసింది. 

 

వీసీల నియామకంపై కొన్నిరోజులుగా గొడవ నడుస్తోంది. కోర్టులో కేసులు నడిచాయి. విద్యార్థులు, ప్రొఫెసర్లు వర్గాల నుండి ఒత్తిడి వచ్చింది. దీంతో గవర్నర్ జోక్యం చేసుకున్నారు. వీసీల నియామకం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కూడా నియామకం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అంతకంటే ముందే ఈసీలను వేయాలని చెప్పారు. దీంతో ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిళ్లను నియమించారు.

 

6 ఏళ్ల తర్వాత వర్శిటీలకు పాలక మండళ్లు వచ్చాయి. ఒక్కో పాలక మండలిలో ఎక్స్ ఆఫీసీయో సభ్యులు కాకుండా 9 మంది సభ్యులను నియమించారు... ఇందులో నలుగురు పలు రంగాల్లో ప్రముఖులు. అయితే ఈ నలుగురిలో ఇద్దరు ముగ్గురు టీఆర్ఎస్ క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. అయితే పాలక మండళ్లలో రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉండడం కొత్తేమి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వాలలోను ఈ సంప్రదాయం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం యూనివర్శిటీలకు పాలకమండళ్లను నియమించింది. ఇందులో టీఆర్ఎస్ నేతలకు ఛాన్స్ ఇచ్చింది. అయితే అధికార పార్టీనేతలకు పాలకమండళ్లలో అవకాశం కల్పించడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. గత ప్రభుత్వాల హయాంలోనే ఇలానే జరిగిందని చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: