గత ఏడాది ఇంటర్ బోర్డు చేసిన నిర్వాకానికి విద్యార్థులు తమ ప్రాణాలు తీసుకున్నారు.  ఫస్ట్ క్లాస్ వస్తామనుకున్న విద్యార్థులకు జీరో మార్కులు రావడంతో షాక్ తిన్నారు.  ఎన్నో ఆశలు పెట్టుకొని ఎగ్జామ్స్ రాసిన వారు ఫెయిల్ కావడంతో మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారు.  అయితే ఇది ఇంటర్ బోర్డ్ తప్పిదం అని తేలిసింది.   అయితే ఈసారి మాత్రం ఇంటర్ ఎగ్జామ్స్ విషయంలో రిజల్ట్ విషయంలో అన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇలాంటి నిర్వాకాలు తెలంగాణలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో కూాడా జరుగుతుంది.  విద్యార్థుల ఆశలు ఆసరాగా తీసుకొని వారి తల్లిదండ్రులకు ఆశలు చూపించి కొంత మంది కేటుగాళ్లు దారుణంగా మోసం చేస్తున్నారు. 

 

ఓ వైపు విద్యార్ధులు సంవత్సరం పాటు కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాస్తుంటే.. ఓ స్కూల్ కు చెందిన సిబ్బంది ఫేక్ ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఫిబ్రవరి 18నుంచి మార్చి 15వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ముసుగులో డియోరియో జిల్లాలో ఓ స్కూల్ కు చెందిన గుమస్తాతో పాటు 11మంది సిబ్బంది ఫేక్ ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు.  ఎంత దారుణం అంటే అటెండర్ ఇంటి సమీపంలో ఉన్న ఓ భవంతిలో ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ ను ఏర్పాటు చేసి..అందులో ఇంటర్ బోర్డ్ సీల్ తో ఉన్న ప్రశ్నా పత్రాల్ని కొంతమంది విద్యార్ధుల చేత రాయిస్తున్నారు. 

 

ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ భవంతిపై దాడి చేసి స్కూల్ స్టాఫ్ తో పాటు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న పలువురు విద్యార్ధుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విద్యార్థులను ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించగా.. తాము ఎగ్జామ్ రాస్తున్నామని తమ సెంటర్ ఇక్కడే పడిందని వారు అమాయకంగా సమాధానం ఇచ్చారు. ఈ తనిఖీల్లో ఉత్తర్ ప్రదేశ్ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ సీల్ వేసిన క్వశ్చన్ పేపర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇాలాంటి మాఫియాలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నారని.. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: