ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన కృర జంతువులు గ్రామాల్లోకి వస్తూ.. తెగ హడావుడి సృష్టిస్తున్నాయి.  ఆ మద్య చిరుత ఏకంగా స్కూల్లోకి వచ్చి ఓ కుక్కను ఎత్తుకు పోయిన సంఘటన తెలిసిందే.  సాదారణంగా గ్రామాల్లో ఎలుగు బంట్లు వచ్చిపడుతుంటాయని వింటుంటాం.  అయితే వాటికి కావాలసిన మేకలు, లేగ దూడలు దొరికితే ఎత్తుకెళ్తుంటాయి.  ఒక్కోసారి మనుషులపై కూడా ఎటాక్ చేస్తుంటాయి.  తాజాగా జనగామ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. రఘునాథపల్లి మండలం గోవర్థనగిరి గ్రామంలోకి ఉదయం ఎలుగు వచ్చింది. అంతే ఎలుగు బంటిని చూడగానే.. గ్రామంలో ఉదయమే ఏదో పనికంటూ బయటికి వెళ్లినవారు, బయటికెళ్లి ఊరిలోకి తిరిగివస్తున్నవారు.. పరుగులు తీస్తూ పక్కనే ఉన్న సందుల్లోకి, తెలిసినవారి ఇళ్లలోకి వెళ్లి దాక్కున్నారు.

 

అయితే ఎలుగు బంటి దర్జాగా గ్రామంలో తిరగడం మొదలుపెట్టింది. ఊర్లోని బడి సమీపంలో చెట్ల కింద మొదట కనిపించింది. అది చూసినవారు అరుస్తూ ఉండటంతో అటూ ఇటూ పరుగెత్తింది.  మొదట ఎలుగు ను చూసిన వారు లేగ దూడ..కుక్క అనుకున్నారు. కానీ సమీపంలోకి రాగానే అది ఎలుగు బంటి అని తెలియగానే పై ప్రాణాలు పైకి పోయాయి.  దాంతో పరుగులు తీస్తూ పారిపోవడం మొదలు పెట్టారు.  అయితే కొంత మంది యువకులు కర్రలు పట్టుకుని ఎలుగుబంటి వెంటపడ్డారు. ఊరి చివరన ఉన్న అటవీ ప్రాంతం వైపు తరిమికొట్టారు.   

 

గ్రామంలోకి ఎలుగు వచ్చింది.. అయితే దాన్ని గ్రామ శివారుకి తరిమి కొట్టారు.. కానీ మళ్లి ఎప్పుడైనా రావొచ్చు అని గ్రామస్తులు బిక్కు బిక్కుమంటున్నారు.   ఊళ్లోకి ఎలుగు బంటి రావడంతో రైతులు భయాందోళనలకు గురయ్యారు.  అటవీ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని తమకు ఇలాంటి కృర మృగాల భారి నుంచి రక్షించాలని అంటున్నారు.  ఇక పక్కనే ఉన్న పొలాలకు వెళ్లాలంటే కొంత మంది రైతులు గజ గజ వణికి పోతున్నారు.  ఏ క్షణంలో ఎలుగు బంటి తమపై పడుతుందో అని భయపడుతున్నారు.  ఇటీవల ఎలుగు బంటి దాడుల్లో మనుషుల ప్రాణాలు కూడా పోయిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: