ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడైతే మూడు రాజధానులు నిర్ణయం తీసుకోవడం జరిగిందో అప్పటి నుండి అమరావతి లో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. రైతులు చేస్తున్న పోరాటానికి దీక్షలకు మరియు నిరసనలకు తెలుగుదేశం పార్టీ అదే విధంగా జనసేన, బిజెపి పార్టీలు మద్దతు తెలపడం జరిగింది. అయినా గాని ప్రభుత్వం నుండి ఎటువంటి మార్పు రాలేదు. అమరావతిలో ఉన్న రైతులు చేస్తున్న డిమాండ్ ఒకటే. రాజధాని అమరావతి లోనే ఉండాలని మూడు రాజధానులు వల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు అంటూ వారి డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు.

 

ఇటువంటి సమయంలో పోరాటాన్ని ఉధృతం చేయడం కోసం అమరావతి రైతులకు ముందు నుండి మద్దతు తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ ఈ పోరాటాన్ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ తమ పార్టీ కార్యకర్తల చేత చేయించడానికి రెడీ అవుతూ జగన్ ప్రభుత్వానికి భారీ ట్విస్ట్ ఇవ్వటం కోసం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అమరావతికి మద్దతు ఉందని అదే సందర్భంలో ఎక్కడా కూడా టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకునే పరిస్థితులు ఏమాత్రం ఉండవని తెలుగుదేశం పార్టీ భారీ స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇటీవల చంద్రబాబు విశాఖపట్టణం వెళ్లిన సందర్భంలో విమానాశ్రయం బయట చంద్రబాబు కాన్వాయ్ ని భారీగా ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంతో ఇటువంటి సంఘటన మరొకసారి పునరావృతం కాకూడదని రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి దీక్షలు చేపట్టడానికి టీడీపీ రెడీ అవుతోంది. అయితే మరోపక్క మూడు ప్రాంతాలలో ఉన్న ప్రజలు అభివృద్ధి అనేది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరిగితేనే బాగుంటుందని ఒకచోట జరగటం వల్ల హైదరాబాద్ విడిపోతే ఎటువంటి ఆర్థిక దెబ్బ తగిలిందో అటువంటిది మళ్లీ భవిష్యత్తులో తగిలే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సందర్భంలో వైయస్ జగన్ తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల నిర్ణయం చాలా కరెక్ట్ అంటూ వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: