ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ దేశాలను, ఖండాలను దాటుతోంది. ఇప్పటికే 50 దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. నిన్నటితో దక్షిణ కొరియాలో కరోనా నిర్ధారణ కేసులు 3,150 దాటాయి. వీరిలో 17 మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 2924కు చేరింది. కాగా ఉత్తర కొరియాలో కరోనా బారిన పడిన వ్యక్తిని నియంత కిమ్ జోంగ్ ఉన్ కాల్చి చంపించారు. 
 
ఉత్తర కొరియా ఇప్పటికే చైనాతో ఉన్న అన్ని సరిహద్దులను మూసివేయటంతో పాటు వాణిజ్య సంబంధాలను కూడా తెంచుకుంది. దేశ నియంత కరోనా రాకుండా చర్యలు చేపట్టాలని ఆధికారులు ఆదేశించారు. నియంత ఆదేశాల మేరకు ఉత్తర కొరియాలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో బాధితుడిని దారుణంగా కాల్చి చంపారు. అధికారులు బాధితుడు బ్రతికి ఉంటే కరోనా ఇతరులకు వ్యాపిస్తుందని అందుకే చంపేశామని చెబుతున్నారు. 
 
అధ్యక్షుడి ఆదేశాల మేరకు కరోనా బాధితుడిని చంపామని చెబుతున్నా ఈ ఘటనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం రేపు ఇరాన్ కు రానుంది. దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ కరోనా దెబ్బతో శుక్రవారం కుప్పకూలింది. 2011 నాటి కనిష్టానికి సూచీలు పడిపోయాయి. కొరియాలో హ్యూందాయ్ సంస్థ షేర్ల విలువ 5శాతం పైగా తగ్గింది. 
 
చైనాలో కరోనా మృతుల సంఖ్య, కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుండటం గమనార్హం. హాంగ్ కాంగ్ లో ఒక పెంపుడు కుక్కలో కరోనా లక్షణాలు కనిపించటం గమనార్హం. అమెరికా నిఘా వర్గాలు ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి, ప్రభుత్వాల సన్నద్ధత గురించి ఆరా తీస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అద్భుతం జరిగి కరోనా అంతర్థానం అవుతుందని అన్నారు. భారత్ దక్షిణ కొరియా, జపాన్ దేశీయులకు ఆన్ లైన్ వీసా అరైవల్ ను రద్దు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: