ఏపీలో అధికార వైసీపీకి తిరుగులేని బలం ఉండటంతో ప్రతిపక్ష టీడీపీ ఏం చేయాలన్న భయపడుతూనే ఉంది. వారిని ఏ విషయంలో అయిన ఢీకొట్టాలన్న ఆచి తూచి అడుగులేస్తుంది. ఒకవేళ ధైర్యం చేసి అడుగు వేసిన టీడీపీకి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఇక ప్రభుత్వం మీద ఏమన్నా విమర్శలు చేసిన, వైసీపీ నేతలు వెంటనే టీడీపీపై విరుచుకుపడుతున్నారు. బయటే టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే అసెంబ్లీలో ఎలా ఉందో గత రెండు మూడు పర్యాయలుగా చూస్తూనే ఉన్నాం.

 

అసలు అసెంబ్లీలో టీడీపీలో నోరు ఎత్తితే చాలు వైసీపీ వాళ్ళు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నారు. ఒకవేళ ఏదైనా తమ ప్రభుత్వం గురించి ఆరోపణలు చేస్తే, వైసీపీ గత ఐదేళ్లు బాబు చేసిన కార్యక్రమాలని చెప్పి, రివర్స్‌లో కౌంటర్లు వేస్తూ టీడీపీ పరువు దారుణంగా తీసేస్తుంది. అలాగే చంద్రబాబు మాట్లాడేప్పుడైతే వైసీపీ నేతలు వెనుక ఉండి తెగ కామెంట్లు చేస్తున్నారు. దీంతో బాబు తెల్లమోహం వేసేస్తున్నారు.

 

ఈ విధంగా అసెంబ్లీలో వైసీపీ, టీడీపీని నోరు ఎత్తనివ్వడం లేదు. అందుకనే కిందటి అసెంబ్లీ సమావేశాల్లో మండలి రద్దు అంశాన్ని సాకుగా చెప్పి చివరిలో సమావేశాలకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇవి కాస్త ఎక్కువ రోజులే జరుగుతాయి. రెండు రోజులు బడ్జెట్ ప్రవేశపెట్టిన, మిగిలిన రోజులు దానిపై చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

 

టీడీపీ ఏదైనా బడ్జెట్ గురించి విమర్శలు చేస్తే, వైసీపీ నేతలు ఏం చేస్తారో తెలుసు. గత ఐదేళ్లు బాబు పరిపాలన తీసుకొచ్చి ఏకీపారేస్తారు. దీంతో మళ్ళీ టీడీపీ పరువుపోతుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీకు వెళ్లకుండా ఉండటం బెటర్ అని తెలుగు తమ్ముళ్ళు ఆలోచన చేస్తున్నారట. వెళ్ళి పరువుపోగొట్టుకోవడం కంటే, వెళ్లకుండా ఉంటేనే మంచిదని అధినేతకు సూచిస్తున్నారట. పైగా ఇటీవల విశాఖ పర్యటనకు వెళ్లిప్పుడు బాబుని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి కాబట్టి, ఆ సాకు చూపించి నిరసనగా అసెంబ్లీకి వెళ్ళొద్దు అని తమ్ముళ్ళు చెబుతున్నారట. మరి తమ్ముళ్ళ బాధని బాబు అర్ధం చేసుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: