బెంగాల్‌లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. బెంగాల్‌ పర్యటనలో భాగంగా కోల్‌కతాలో జరిగిన బహిరంగ సభలో మమత సర్కార్‌పై ఆయన  విమర్శలతో విరుచుకుపడ్డారు. అలాగే NSG కాంప్లెక్స్‌ను ప్రారంభించిన ఆయన... దేశంలో అశాంతికి ప్రయత్నిస్తే భారీ మూల్యం తప్పదంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు షా. 

 

2021లో బెంగాల్‌లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. మూడింట రెండొంతుల మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. బెంగాల్‌ పర్యటనలో భాగంగా కోల్‌కతా షాహీద్ మినార్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో కలిసి పాల్గొన్నారు అమిత్‌ షా. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ యూటర్న్‌ తీసుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చొరబాట్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన మమత...  మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన CAAను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.  


 
కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి మమతా బెనర్జీతో చెలిమి చేస్తున్నారని అమిత్‌ షా విమర్శించారు. నరేంద్ర మోడీని ఎదుర్కోడానికే వాళ్లంతా ఒక్కటయ్యారని దుయ్యబట్టారు. బెంగాల్‌ పర్యటనలో ముందుగా రాజార్‌హాట్‌ వెళ్లారు వెళ్లి... కొత్తగా నిర్మించి NSG - స్పెషల్‌ కాంపొజిట్‌ గ్రూప్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్‌తో పాటే మానేసర్‌, హైదరాబాద్‌, చెన్నై, ముంబయిలోని ఎన్‌ఎస్‌జీ భవనాల్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు అమిత్‌ షా. దేశంలో అశాంతి సృష్టించే శక్తుల్ని అణచివేస్తామన్నారు షా. దేశాన్ని రెండుగా విభజించాలని చూస్తున్న వాళ్ల గుండెల్లో ఎన్ఎస్‌జీ నిద్రపోతుందన్నారు కేంద్ర హోం మంత్రి. 


 
అమిత్‌ షా బెంగాల్‌ పర్యటనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, వాపక్షాలు, ప్రజాసంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.  అమిత్ షా ఎయిర్‌ పోర్టుకు చేరకున్నారని తెలియగానే నలుపు బెలూన్లు ఎగురవేశారు. అమిత్ షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఢిల్లీ అల్లర్లకు బీజేపీయే కారణమని... మతతత్వంతో అల్లర్లకు అగ్గి రాజేసింది ఆరోపించారు ఆందోళనకారులు. టూర్‌లో భాగంగా కోల్‌కతాలో కాళీఘాట్‌ను సందర్శించారు అమిత్‌ షా. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మొత్తానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బెంగాల్‌ పర్యటన హాట్‌హాట్‌గా సాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: