ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో అధినేత ముకేశ్ అంబానీ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ సంస్థలు పెట్టుబడులు పెట్టడం లేదని పెట్టిన పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు తరలింపు కార్యక్రమం జగన్ వచ్చాక జరుగుతోందని ప్రతిపక్షాలు మొన్నటివరకు ఆరోపించాయి. ఇటువంటి సందర్భంలో  వైయస్ జగన్ నివాసం తాడేపల్లి లో ముకేశ్ అంబానీ స్వయంగా వెళ్లి ఆయన్ని కలవడం తో టీడీపీకి మతి పోయినట్లు అయింది. ఎప్పటినుండో తెలుగు రాజకీయాలలో అంబానీ లు కేవలం టిడిపి అదినేత చంద్రబాబుకు మాత్రమే సన్నిహితమని అనుకుంటారు. కాని ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, రిలయన్స్ అదినేత ముకేష్ అంబానీ...జగన్ తో సమావేశం కావడం సంచలనం సృష్టించింది.

 

దాదాపు ఇద్దరు గంటకుపైగా భేటీ అయి అనేక విషయాల గురించి చర్చించుకున్నారనీ సమాచారం. కచ్చితంగా ఈ మీటింగ్ పారిశ్రామికవర్గాలకు గాని, ఎపి ప్రజలకు గాని అత్యంత ఆసక్తి కలిగించే విషయమే అవుతుంది. ఎపిలో పరిశ్రమల ఏర్పాటుకు సంబందించి వారి మద్య చర్చలు జరిగాయని చెబుతున్నారు. ఈ సమావేశంలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్‌నత్వానీ పాల్గొన్నారు. వీరి మద్య చర్చలు ఫలప్రదం అయి ఎపిలో కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

 

ముఖ్యంగా అంబానీ జగన్ చేతిలో చెయ్యేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగానే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నట్లు హామీ ఇచ్చినట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి. ఇదే సందర్భంలో వీరిద్దరి బేటీ గురించి  తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టానుసారం అయిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆనాడు కేజీ బేసిన్‌ అనే మన గ్యాస్ ను రిలయన్స్‌ వాళ్లు పట్టుకెళ్ళి పోతున్నారని తెగ గగ్గోలు పెట్టిన వైయస్ జగన్ ఇప్పుడు ఆయనతో ఎలా భేటీ అయ్యారని విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్ తో ముకేశ్ అంబానీ భేటీ అవ్వటం పెద్ద హైలెట్ వార్తగా ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: