ఎమ్మెల్యే, సినీ నటి రోజా గురించి పరిచయం చేయనక్కర్లేదు. ఇటు రాజకీయాల్లో గత కొద్దికాలంగా టీవీ ప్రోగ్రాముల్లో ఆమె ఫుల్​ బిజీ. మరో హీరోయిన్​ కుష్బూ గురించి కూడా అందరికీ తెలుసు. అభిమానులు గుడి కట్టే అంత ఆదరణ ఆమె సొంతం. అలాంటి వారిద్దరూ తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంలో ఈ ఇద్దరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రోజాతో కలిసి సినీ నటి కష్బూ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములయ్యారు. నటుడు అర్జున్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆమె… హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మొక్కలు నాటారు.

 

తాజాగా ఈ పరంపరలో మరో వైసీపీ నేత చేరారు. అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలు నాటారు. ఈ రోజు ఆయన జన్మదినం కావడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉండాల్సిన అడవుల శాతం కన్నా తక్కువ శాతం అడవులు ఉన్నాయనీ.. మనం మొక్కలు నాటి అడవుల శాతం పెంచాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం వల్ల మనం భవిష్యత్‌ తరాలకు భరోసా ఇచ్చినట్లవుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరి జీవన విధానంలో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం భాగమవ్వాలని  ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే తెలిపారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌తో పర్యావరణ పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే.. మరింత మంది మొక్కలు నాటాలని సవాలు విసిరారు. 

 

ఇక మొక్కలు నాటిన తర్వాత కుష్భూ మరో ముగ్గురికి హరిత సవాల్ విసురుతూ… నటులు మీనా, సుహాసిని, డ్యాన్స్ మాస్టర్ బృందం మొక్కలు నాటాలని కోరారు. అనంతరం కుష్బూ మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. అందరూ ఇలాగే ఆలోచిస్తే పర్యావరణానికి మేలు చేసిన వాళ్లమవుతామన్నారు. భవిష్యత్ తరాలకు మంచి జీవితం అందించే బాధ్యత మనపై ఉందన్నారు. పర్యావరణం రక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి ఆలోచన అని ప్రశంసించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: