కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా సహా అనేక ప్రపంచదేశాలు ఈ కరోనా దెబ్బతో విలవిల్లాడుతున్నాయి. కానీ.. సంక్షోభాలు కూడా కొన్ని అవకాశాలు తెస్తాయి. కరోనా కూడా అలాంటిదే.. కరోనా గురించి భయపెట్టే వార్తలు చదవడమే కాదు.. ఈ కరోనాను ఉపయోగించుకుంటే మీరు లక్షలు సంపాదించే అవకాశం కూడా ఉంది.

 

 

అదేంటి కరోనాను ఎలా వాడుకోవాలి అంటారా.. కరోనా భయంతో ఇప్పుడు ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు కూడా నేల చూపులు చూస్తున్నాయి. గత వారమంతా స్టాక్‌ మార్కెట్‌ మదుపరులకు నష్టాలతో కష్టాలను చూపించింది. మొత్తం స్టాక్ మార్కెట్లో దాదాపు 6శాతం నష్టపోయింది. ఇప్పుడు మంచి మంచి షేర్లు కూడా తక్కువ ధరలకు లభ్యమవుతున్నాయి.

 

 

నిన్న మొన్నటి వరకూ స్టాక్ మార్కెట్ మంచి జోష్ లో ఉండేది. చిన్న మదుపరులు షేర్లు కొనాలంటే అమ్మో అంత రేటా అని భయపడేవారు. అలాంటి వారికి ఇప్పుడు మంచి అవకాశం లభించింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని.. పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. అందరూ ఆందోళనతో ఉన్నప్పుడే మార్కెట్లోకి ప్రవేశించాలన్నది వారెన్ బఫెట్ వంటి వారు చెప్పే పెట్టుబడి సూత్రం.

 

 

అయితే ఇలాంటి సమయంలో మర్కెట్లో పెట్టుబుడలు పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టాలి. నష్టం వచ్చినా తట్టుకోగలం అనుకుంటే.. చైనాతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టండి. పరిస్థితులు సర్దుకున్నాక అవి అధిక రాబడులను అందించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సమయాల్లో ఫండమెంటల్స్ బాగా ఉన్న షేర్లు కూడా కాస్త తక్కువ ధరలకు వస్తుంటాయి. అలాంటి వాటిని గుర్తించి పెట్టుబడి పెడితే.. అవి ముందు ముందు మీకు మంచి ఫలితాలు అందిస్తాయి. పెట్టుబడులకు వైవిధ్యమే ప్రాణం. ఒకేచోట మొత్తం పెట్టుబడులు ఉండటం ఎప్పడూ సరికాదు. అవకాశం ఉన్న అన్ని పథకాల్లోనూ క్రమానుగత పెట్టుబడులు కొనసాగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: