గ్రేట‌ర్ హైద‌రాబాద్ జ‌నాల‌కు గుడ్ న్యూస్‌. గ్రేట‌ర్ షేప్ మారిపోనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో మొత్తం 150 డివిజ‌న్లు ఉన్నాయి. గ్రేట‌ర్ ప‌రిధి విస్తృతం అవ్వ‌డంతో ప్ర‌జ‌ల‌కు చాలా సౌక‌ర్యాలు స‌రిగా అంద‌డం లేద‌ని గ్రేట‌ర్‌ను ఢిల్లీ త‌ర‌హాలో మూడు గ్రేట‌ర్లుగా విభ‌జించాల‌ని ముందుగా అనుకున్నారు. ఇప్పుడు అలా కాకుండా గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న వార్డుల‌ను పెంచాల‌ని డిసైడ్ అయ్యారు. కార్పొరేషన పరిధిలో డివిజన్ల పునర్విభజన మళ్లీ తెరపైకి వచ్చింది. జీహెచ్ఎంసీకి కొత్త మున్సిపల్ చట్టం వచ్చాక.. డివిజన్లను పెంచాలనే యోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది.



కొత్త పున‌ర్విభ‌జ‌న ప్ర‌కారం ప్ర‌తి 50వేల మంది జ‌నాభాకు ఒక డివిజ‌న్ ఉండేలా ప్ర‌భుత్వ యంత్రాంగం క‌స‌ర‌త్తులు చేస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. వీటి సంఖ్యను జనాభా ప్రాతిపధికన 180 నుంచి 200 వరకు పెంచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రేట‌ర్లో డివిజ‌న్లు పెరిగితే అందుకు అనుగుణంగా కార్పొరేట‌ర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. రాజ‌కీయ పార్టీల‌కు చెందిన ప‌లువురు నేత‌ల‌కు కొత్త ప‌ద‌వులు వ‌స్తాయి.



ప్ర‌స్తుతం జీహెచ్ఎంసీ పాల‌క వ‌ర్గం గ‌డువు 2021 ఫిబ్రవరితో ముగియనుంది. ఈ లోగానే జీహెచ్ ఎంసీ కొత్త చ‌ట్టం తీసుకు వ‌చ్చి ఇప్పుడు ఉన్న డివిజ‌న్ల‌ను పునర్విభ‌జ‌న చేసి వీటిని పెంచాల‌ని.. ప్ర‌తి 50 వేల మంది జ‌నాభాకు ఒక డివిజ‌న్ ఉండేలా ప్లాన్ చేయాల‌ని భావిస్తోంద‌ట‌. డివిజన్ల పునర్విభజన జరిగితే శివారు ప్రాంతాల్లో మరిన్ని పెరిగే అవకాశం ఉంది. న‌గ‌రం బ‌య‌ట‌కు బాగా విస్త‌రిస్తుండ‌డంతో ప‌శ్చిమ హైద‌రాబాద్ ఏరియాలో మ‌రిన్ని ఎక్కువ డివిజ‌న్లు రానున్నాయి.



అదే జ‌రిగితే హైద‌రాబాద్ లో రాజ‌కీయం మ‌రింత రంజుగా మార‌నుంది. మ‌రో 30- 50 మంది కార్పొరేట‌ర్ల‌తో రాజ‌కీయంగా మ‌రింత సంద‌డి పెరుగుతుంది. ఇక హైద‌రాబాద్‌లో డివిజ‌న్ల షేప్‌లు కూడా పూర్తిగా మారిపోతాయి. మ‌నం స‌రికొత్త హైద‌రాబాద్ ను చూస్తాము.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: