బ్యాగులు, బెల్టులు, బూట్లు, గడియారాలు, ఫోన్ బ్యాక్ సైడ్స్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తువులను ఆకర్షణీయంగా మార్చేందుకు, ఇంకా ఎక్కువ కాలం పాడవకుండా ఉండేందుకు జంతువుల స్కిన్/తోలు నుండి లెదర్ తయారుచేస్తున్నారు వ్యాపారస్తులు. అయితే కొంతమంది ధనికులు ఈ లెదర్ వస్తువులని కొన్నప్పటికీ... అది జంతువుల స్కిన్ నుండి తయారు చేయబడిందని గిల్టీ గా ఫీల్ అవుతుంటారు. అలాగే జంతువుల తోలు నుండి తయారు కాబడిన లెదర్ వస్తువులను వాడితే... కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఇద్దరు మెక్సికన్ పారిశ్రామికవేత్తలు వెదర్ ను మొక్కల నుంచి ఎందుకు తయారు చేయలేమని పరిశోధన చేసి చివరికి ఎడారి మొక్క అయిన బ్రహ్మజెముడు నుండి లెదర్ తయారు చేసి చూపించి అందరి మన్నలను పొందుతూ ఉన్నారు.



నిజం చెప్పుకోవాలంటే మెక్సికన్ పారిశ్రామికవేత్తలైన ఆండ్రియాన్ లోపేజ్, మార్ట్ కాజారేజ్ కలిసి బ్రహ్మజెముడు(cactus) నుండి శాకాహారం లెదర్ ని తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ఐతే జంతువుల నుండి తయారు చేసిన లెదర్, బ్రహ్మజెముడు నుండి తయారుచేసిన లెదర్ రెండూ ఒక్కటే విధంగా కనిపిస్తాయి. ఐతే, ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు మెక్సికన్ నగరంలో 2 హెక్టార్ల స్థలంలో ఈ మొక్కలను పెంచి తమ పరిశోధన చేశారు. ఈ మొక్కలకు నీరు అవసరం లేదు కాబట్టి అలవోకగా ఇంకో నలభై హెక్టార్ల వైశాల్యంలో ఈ మొక్కలను పెంచేందుకు ఇద్దరు పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు.



లెదర్ ఎలా తయారు చేస్తారంటే... ఈ హెక్టార్ల ల లో బాగా పెరిగిన మొక్కల ఆకులను కట్ చేసి, శుభ్రపరిచి, గుజ్జులాగా చేసి మూడు రోజుల పాటు సూర్యరశ్మిలో ఎండబెడతారు. ఆ తరువాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా నాచురల్ పద్ధతిలో రంగు వేస్తారు. ఇలా తయారు చేసిన లెదర్ ని వస్తువులను తయారుచేసే కర్మాగారాలకు అమ్ముతారు. ఆ కర్మాగారాలు లెదర్ వస్తువులను తయారు చేసి ప్రజలకు విక్రయిస్తాయి. బ్రహ్మజెముడు(cactus) నుండి తయారు చేసిన లెదర్ ఒక దశాబ్దం పాటు డామేజ్ అవ్వకుండా ఉండగలదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: