ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పరిపాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ దేశవ్యాప్తంగా తెగ పొగుడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా తరుణంలో ఇప్పటి వరకు జగన్ ని ఇబ్బంది పెట్టిన బ్యాడ్ న్యూస్ మరియు తలపోటు తెచ్చిన పరిస్థితులు ఇలాంటివి ఎక్కడా కూడా రాష్ట్రంలో చోటు చేసుకోలేదు. ఇటువంటి తరుణంలో తాజాగా మార్చి నెల మొత్తం వైయస్ జగన్ కి తలపోటు తెప్పించే బ్యాడ్ న్యూస్ లు వరుసగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విషయంలోకి వెళితే వచ్చే మార్చి 31 వ తారీకు లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి లేకపోతే 14వ ఆర్థిక సంఘం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన కొన్ని వేల కోట్ల నిధులు ఆగిపోయే పరిస్థితి ఉందని బలమైన వార్తలు వినబడుతున్నాయి.

 

ఇదే తరుణంలో హైకోర్టు కూడా ఈ నెలాఖరులోపు లోకల్ ఎలక్షన్లు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్క రాజ్యసభ ఎన్నికలు కూడా ముందుకు రావడంతో రెండు ఎన్నికలు ఒకేసారి రావడంతో జగన్ కి టెన్షన్ మొదలైనట్లు సమాచారం. మరో పక్క కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన 59% రిజర్వేషన్ అంశంలో క్లారిటీ వచ్చాక లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో ముందడుగు వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

దీంతో ఒక పక్క రాజ్యసభ ఎన్నికలు మరో పక్క స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా రావడంతో ఎన్నికలు నిర్వహించడానికి విద్యాసంస్థలు ఖాళీ లేకపోవడంతో ఏం చేయలేని పరిస్థితిలో జగన్ ఉన్నట్లు దీంతో ఒకవేళ ఎన్నికలు జరగకపోతే మాత్రం దాదాపు కొన్ని వేల కోట్లు 14వ ఆర్థిక సంఘం నుండి రావలసినవి ఆగిపోయే పరిస్థితి ఉండటంతో మార్చ్ మొత్తం జగన్ కి తలపోటు మరియు బ్యాడ్ న్యూస్ లు స్టార్ట్ అయింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: