రాబోయేదంతా ఎలక్ట్రానిక్ కార్ల యుగం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్స్‌కు వచ్చే సరికి బేసిక్ మోడలే పది లక్షలు పైన చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఫ్రెంచ్ ఆటోమొబైల్ కంపెనీ ... చౌక ధరలో ఎలక్ట్రానికి కారుని తయారు చేసింది. దీని ధర ఐదు లక్షల లోపే.

 

ఈ బుల్లి కారు పేరు.. ఎమి. వాషింగ్‌ మెషీన్‌ కంటే కాస్త పెద్దగా కనిపిస్తున్న ఈ బుజ్జి కారు ధర 6వేల యూరోలు. మన కరెన్సీలో 4లక్షల 47వేల రూపాయలు. ఈ ధరలో ఎలక్ట్రానిక్ కారు అందించడం చాలా కష్టం. ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ సిట్రోన్.. ఈ బుజ్జి కారుని తయారు చేసింది. ఇందులో ఇద్దరు కూర్చోవచ్చు. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.

 

కారులో 8 హార్స్‌పవర్ మోటర్‌తో నడుస్తుంది. బ్యాటరీని చార్జ్ చేసేందుకు 6కేవీ విద్యుత్ కనెక్షన్ ఉంది. దీన్ని ఫ్రాన్స్‌లో 14 ఏళ్ల పిల్లలు కూడా నడపవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. దీన్ని కారు అనే కంటే నాలుగు చక్రాల స్కూటర్ అనచ్చని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

 

ఎమీకి కోసం బుకింగ్స్‌ మొదలయ్యాయి. ఇప్పటికే భారీగా ఆర్డర్లు వచ్చాయి. దీనికి ఏదైనా సమస్య వస్తే రిపేర్ చేయడం చాలా తేలిక. కార్‌లో ఉన్న డాష్‌బోర్డ్‌లో స్మార్ట్‌ ఫోన్‌ డిస్‌ప్లే స్క్రీన్‌గా మారిపోతుంది. ఒక్కసారి చార్జింగ్  చేస్తే 70 కిలోమీటర్లు వెళుతుంది. మూడుగంటల్లో ఫుల్‌ చార్జ్‌ అవుతుంది. 

 

ఈ కారుని సిట్రోన్‌ సంస్థ నెలసరి వాయిదాల్లో కూడా అందిస్తామని ప్రకటించింది. నెలకు 20 యూరోలు కట్టి సంస్థ షోరూమ్‌ల నుంచి దీన్ని తీసుకోవచ్చు. మన కరెన్సీలో 1600 రూపాయలు. సిట్రోన్ వందో యానివర్సరీ సందర్బంగా..  ఈ బుల్లి కారుని జెనీవా మోటార్‌షోలో ఆవిష్కరించారు. మార్చ్ 30 నుంచి ఫ్రాన్స్‌లో.. ఆ తర్వాత కొన్నిరోజులకు యూరప్ దేశాల్లో ఈ బుల్లి కారు అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: