వరుసకు తల్లి అవుతుంది కానీ వావి వరుసలు మరచి అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు.. అయితే చివరికి కుక్క చావు చచ్చాడు.. కామంతో కొట్టుకున్న అతనికి కాలమే బుద్ది చెప్పింది.. తండ్రి రెండొవ భార్యతో సంబంధం పెట్టుకున్న చివరికి అడ్రస్ లేకుండా పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర కర్ణాటకలోని విజయపురా జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యాసంస్థల గ్రూపు అధినేత హత్యోదంతం చిక్కుముడి వీడింది. ఆయన హత్య కేసులో అయిదుమందిని పోలీసులు అరెస్టు చేశారు. హతడి మొదటి భార్య కుమారుడు, రెండో భార్య మధ్య అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు దారి తీసిందని పోలీసులు నిర్ధారించారు.

 

 


విజయపురా జిల్లాలోని బసవన బాగేవాడిలో గల మడివాళేశ్వర గ్రూపు విద్యాసంస్థల అధినేత. కిందటి నెల 25వ తేదీన ఆయన దారుణ హత్యకు గురయ్యారు. హంతకులు ఆయనను గొంతు కోసి హత్య చేశారు.కాలేజీ యాజమాన్య అద్యక్ష్యుడు  సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ హత్య ఘటన పై పోలీసులు ప్రత్యేక శ్రద్ద తీసుకొని మరి దర్యాప్తు చేస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, హంతకుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలను చేపట్టింది.

 


అయితే.. దర్యాప్తులో మొదట కుటుంబ కక్షల వల్లనో లేక ఆస్తి కోసమో జరిగి ఉంటుందని అనుకున్న కేసు దర్యాప్తులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.. ఆయనతో శతృత్వం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. సుమారు 12 మందిని అదుపులోకి తీసుకుని విచారించినప్పటికీ.. పోలీసులకు ఎలాంటి లీడ్ చిక్కలేదు. దీనితో- వారి దృష్టి కుటుంబ సభ్యులపై పడింది. దాము నాయక్‌కు పెద్ద ఎత్తున ఆస్తులు ఉండటం, అలాగే వరుస పెళ్లిళ్లు చేసుకోవడం పై అనుమానాలు మొదలైయ్యాయి. 

 


మొదటి భార్య కుమారుడు సుభాష్ నాయక్.. రెండో భార్య ప్రేమా దాము నాయక్ మధ్య ఏర్పడిన అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు దారి తీసిందని తేలింది. దాము నాయక్‌ను అడ్డు తొలగించుకుంటే.. కోట్లాది రూపాయల ఆస్తి తమ వశం అవుతుందని నిందితులు భావించారని, ఆయనను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులకు సుపారీ ఇచ్చారని జిల్లా ఎస్పీ తేల్చి చెప్పారు. 

 

 

సుభాష్ నాయక్, ప్రేమా నాయక్‌లతో పాటు అశోక్ లమాణి. అవ్వణ్ణ గ్వాతగి, శివణ్ణ కొణ్ణూర్‌లను అరెస్టు చేశారు పోలీసులు. దాము నాయక్‌ను హత్య చేయడానికి అశోక్ లమాణి, అవ్వణ్ణ గ్వాతగి, శివణ్ణ కొణ్ణూర్‌లకకు లక్షలాది రూపాయలను సుపారీగా ఇచ్చారని వెల్లడించారు.వారిచ్చిన సుపారీ వల్లనే అతన్ని దారుణంగా హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు వెల్లడించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: