తమ చేతికి మట్టి అంటకుండా వ్యవహారం ఎలా చక్క పెట్టాలో కొంతమందికి బాగా తెలుసు. అటువంటి వ్యవహారాలను చెక్క పెట్టగల మహానుభావులు కొంతమంది తెలుగు మీడియాను శాసించే రేంజ్ లో ఉన్నారు. ఆయనే ఈనాడు సంస్థల అధిపతి రామోజీ !  కేవలం ఒక పార్టీకి, ఒక వర్గం ప్రజలకు న్యాయం జరిగితే చాలు, రాష్ట్రం మొత్తానికి జరిగినట్టుగా భావించే ఈనాడు మీడియా సామ్రాజ్యాధినేత కు సంబంధించిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పచ్చళ్ల అమ్మకం నుంచి జీవితాన్ని ప్రారంభించి  ప్రపంచ మేధావిగా కీర్తిని సంపాదించే స్థాయికి వెళ్లడం వెనుక రామోజీ కష్టాన్ని అందరూ మెచ్చుకోవలసిందే.  


మొన్నటి వరకు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా వ్యవహారం నడిచేది. ఇప్పుడు తనకు ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టడాన్ని రామోజీ  జీర్ణించుకోలేకపోతున్నారు. అంతే కాకుండా కొత్త ప్రభుత్వం మీడియా సంస్కరణలు తీసుకువచ్చి నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు, అసత్య కథనాలు ప్రచురిస్తే కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు రూపొందించడంతో సదరు మీడియా అధినేతలో భయం మొదలైంది. అందుకే మొన్నటి వరకు చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ పెద్దాయన రామోజీ ఇప్పుడు దాని నుంచి తప్పుకుని తెలంగాణ బాధ్యతలు డీఎన్ ప్రసాద్ కు, ఏపీకి మానుకొండ నాగేశ్వరావు అనే వ్యక్తిని ఎడిటర్ గా నియమించారు.


 ఒక్క ఎడిటరే కాదు వారే పబ్లిషర్, వారే ప్రింటర్ గా బాధ్యతలు అన్నీ అప్పగించేసి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. తెలంగాణ వేరు, ఏపీ వేరు అన్నట్టుగా రామోజీరావు, రిలయన్స్ సంస్థలు కేవలం ఓనర్లు మాత్రమేనని, ఆ బరువు, బాధ్యతలు, పరిణామాలు అన్ని సదరు ఎడిటర్ పై పడేలా సదరు మీడియా అధినేత చాణిక్యత ప్రదర్శించారు. ప్రభుత్వం, పార్టీలు, వ్యక్తుల నుంచి గాని ఏవైనా ఇబ్బందులు వస్తే, ఆ తర్వాత మొత్తం ఆ తప్పొప్పులకు ఎడిటర్లే బాధ్యత వహించాలి. ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ బయట వ్యక్తులకు అప్పగించడంతో రామోజీరావు కాస్త రిలాక్స్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. రామోజీ తెలివితేటలు మాములుగా ఉంటాయా ? అందుకే ఆయన్ను చంద్రబాబు కి రాజగురువు అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: