దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 11 నెలలు పరిపాలించడం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో జగన్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు కొందరు అయితే మరికొందరు కాంగ్రెస్ హైకమాండ్ మాట వినే వాళ్ళు. ఆ సమయంలో సీఎం స్థానంలో ఉన్న కొణిజేటి రోశయ్య అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏ సమావేశానికి వెళ్లిన పార్టీ మీటింగ్ మరియు ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లి జగన్ ని సపోర్ట్ చేసే వాళ్ళు వెంటనే కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవాలి జగన్ ని ముఖ్యమంత్రి చేయాలి అంటూ రోశయ్య కి తలనొప్పులు తెచ్చి పెట్టే వాళ్ళు. సరిగ్గా పదేళ్ళ తర్వాత ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది.

 

ఈ సందర్భంగా ఇటీవల కొణిజేటి రోశయ్య ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ సీఎం అయ్యాక కొత్తలో ఇంటికి వచ్చి కలుసుకున్నారని చెప్పటం జరిగింది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా విశాఖపట్నం పరిపాలన రాజధానిగా జగన్ చేయాలని ఆలోచిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి విశాఖపట్టణంలో పరిపాలనకు తగ్గ భవనాలు దొరకటం చాలా కష్టం అవుతున్న తరుణంలో రంగంలోకి కొణిజేటి రోశయ్య దిగినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే రోశయ్య ఏకైక కుమార్తె విశాఖలో నివాశం ఉంటున్నారు. అల్లుడు పైడా క్రిష్ణ ప్రసాద్ విశాఖలో విద్యాలయాల అధిపతిగా ఉంటున్నారు.

 

ఆయనకు భీమిలీకి దగ్గరలో బ్రహ్మాండమైన వసతులతో భవనాలు ఉన్నాయి. వాటిని ఇపుడు జగన్ ప్రభుత్వానికి రోశయ్య ఇవ్వడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. విశాఖ పరిపాలన రాజధాని చేస్తే కచ్చితంగా కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అలాగే వందల సంఖ్యలో భవనాలు కూడా అవసరం అవుతాయి. అందుకోసం ఇప్పటి నుంచే ప్రభుత్వం ప్రైవేటు భవనాలతో పాటు, ప్రభుత్వ భవనాలు కూడా పెద్ద ఎత్తున పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో రోశయ్య తన అల్లుడి భవనాలను జగన్ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా ఇది జరిగితే జగన్ కి కొండంత బలం రోశయ్య ఇచ్చినట్లే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: