మధ్య పాపం మెగాస్టార్ చిరంజీవి తన ప్రమేయం లేకుండా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోతున్నాడు. జగన్ చిరంజీవికి వైసీపి పార్టీ తరఫున రాజ్యసభ సీటు ఇస్తున్నారని అందరూ ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతో రాజకీయ వర్గాల్లో ఆయన పేరు చర్చనీయాంశం అయిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి తరలించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న జాయింట్ యాక్షన్ కమిటీ మూడు రాజధానులు ప్రతిపాదనకు మద్దతు తెలిపిన చిరంజీవికి వ్యతిరేకంగా ఆయన ఇంటి ముందు దీక్ష చేయడానికి సిద్ధం అయినట్లు వార్తలు రాగా చిరు అభిమానులు వారిని అడ్డుకోవడానికి ఒక సైన్యం లో తయారైన విషయం తెలిసిందే.

 

IHG

 

అయితే చిరు ఇంటి ముందు నిరసన కార్యక్రమం పై అమరావతి జేఏసీ వెనక్కి తగ్గినప్పటికీ చిరు అభిమానుల బృందం మాత్రం అతని ఇంటి ముందే అతనికి రక్షణగా నిలబడి ఉన్నారు. అంతేకాకుండా చిరంజీవి కి మద్దతుగా కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇక చిరు అభిమానుల సంఘాన్ని నడిపించే వ్యక్తులే కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నారు. అమరావతి జేఏసీకి హెచ్చరికలు జారీ చేస్తూ చాలా తీవ్రంగా వీడియోలు పెడుతున్నారు.

 

IHG

 

అయితే చిరు కి మద్దుతుగా వచ్చిన వారందరికీ ఒక కార్డుని ఇవ్వగా…. కార్డు వేసుకొని ఉన్న వాళ్ళు ఫోటోలు వీడియోలు చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉండగా ఐడీ కార్డు లో చిరంజీవి బొమ్మ వెనకాల కనిపిస్తున్న రంగులే అందరినీ షాక్ కు గురి చేశాయి.

 

వైఎస్సార్ కాంగ్రెస్ రంగులనే ఐడీ కార్డుల బ్యాగ్రౌండ్ కోసం వాడారు. దీంతో బ్యాచ్ అంతా వైఎస్సార్ కాంగ్రెస్ బ్యాక‌ప్‌తో న‌డుస్తోంద‌న్న అభిప్రాయాలు క‌లుగుతున్నాయి. ఓవైపు ప‌వ‌న్ అమ‌రావ‌తి కోసం నిల‌బ‌డుతుంటే.. చిరు జ‌గ‌న్ నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో ఆయ‌న వైకాపా మ‌ద్ద‌తుదారుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఐడీ కార్డుల వ్య‌వ‌హారంతో చిరుకు వైకాపా రంగు మ‌రింత‌గా అంటుకుంటుండ‌టం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: