దేశంలో ప్రస్తుతం ఎక్కడైనా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అంటే అక్కడ కచ్చితంగా వినిపించే పేరు ప్రశాంత్ కిషోర్ దే. గత ఐదేళ్లలో ప్రశాంత్ కిషోర్ దేశంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగిన తీరు అసలు నమ్మశక్యం కానిది. 2014 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీ తో మొదలు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గెలుపొందిన వరకు మధ్యలో జగన్ లాంటి పెద్ద పెద్ద నేతలతో పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ కు ప్రతి చోటా విజయం లభించింది.

 

ఎంత ఎన్నికల వ్యూహకర్త అయినా కూడా ప్రత్యక్ష రణక్షేత్రం లోకి దిగి పోరాడటం చేతకాదు అని అంతా అంటుంటారు. ప్రశాంత్ కిషోర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఎందరికో రికార్డు విజయాలు అందించిన పీకే కు ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు ధైర్యం లేనట్లుంది. పరోక్ష ఎన్నిక ద్వారా చట్టసభలకు అడుగుపెట్టేందుకు దాదాపు అతను మార్గం సుగమం చేసుకొన్నాడు.

 

IHG

 

 

పీకే సరే అనాలి గానీ... ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి బీజేపీ సహా దేశంలోని చాలా పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి. క్రమంలో త్వరలో ఎన్నికల సమరాంగణంలోకి దూకేందుకు సిద్ధమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పీకేకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు రెడీ అయిపోయారట. బెంగాల్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో తృణమూల్ కు పీకే ఎన్నికల వ్యూహాలను రచించనున్నాడట. క్రమంలో తన పార్టీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ సీట్లలో సీటును పీకేకు ఇచ్చేందుకు దీదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

 

IHG

 

దీంతో పార్టీలో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీని ఎన్నికల్లో గెలిపించేందుకు ప్రశాంత్ కిశోర్‌తో ఒప్పందం కుదుర్చుకుని డబ్బులిస్తున్నాక ఇంకా పదవులు కూడా ఇవ్వడం ఎందుకన్న ప్రశ్న వేస్తున్నారువారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారిని కాదని ఇలా ఎవరికి పడితే వారికి పదవులు ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: