ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతూ ఆయన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కమీడియన్  వెన్నెల కిషోర్. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కమెడియన్ లలో ఒకరుగా కొనసాగుతూ.. వరుస  సినిమాల్లో  తనదైన కామెడీతో అలరిస్తున్నారు వెన్నెల కిషోర్. స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటిస్తూ కడుపుబ్బ నవ్విస్తాడు. ఇక మరోవైపు సినీ ప్రేక్షకులు కూడా వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ కి బాగా కనెక్ట్ అయిపోయారు అనే చెప్పాలి. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పటికే ఎంతో క్రేజ్ సంపాదించాడు వెన్నెల కిషోర్. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఒకానొక సమయంలో ఉత్తమ కమెడియన్ గా  కూడా అవార్డులు అందుకున్నారు వెన్నెల కిషోర్. 

 

 ప్రస్తుతం ఏ  స్టార్ హీరో సినిమాలో చూసిన వెన్నెల కిషోర్ దర్శనమిస్తున్నాడు. స్టార్ హీరోలకు జోడిగా.. మొత్తం పక్కనే ఉంటూ తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్నాడు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్గా కొనసాగుతున్న వెన్నెల కిషోర్ అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు... ఇంతలా స్టార్ కమెడియన్ అవ్వడానికి కారణం ఏమిటి అనేది తెలుసుకుందాం. అయితే వెన్నెల కిషోర్ తన తొలిచిత్రం వెన్నెలను ఇంటిపేరుగా మార్చుకుని చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. అయితే అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వెన్నెల కిషోర్ కు సరదాగా వెన్నెల అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 

 

 

 

 అయితే వెన్నెల కిషోర్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే వెన్నెల అనే సినిమాలో అవకాశం రాగా... వెన్నెల కిషోర్ కు రైటింగ్ పై ఎక్కువ ఆసక్తి ఉండడంతో వెన్నెల సినిమా డైరెక్టర్ దేవకట్టా దగ్గర పని చేసేందుకు వెళ్లారు. అయితే వెన్నెల  సినిమాలో ఒక పాత్ర కోసం శివారెడ్డి ని ఎంపిక చేశారు. కానీ చిత్రీకరణ మొత్తం అమెరికాలో ఉండడంవల్ల శివారెడ్డికి వీసా రద్దయింది. ఇక ఆ తర్వాత ఆ పాత్ర కోసం నిర్వహించిన ఆడిషన్లో దర్శకుడికి ఎవరు నచ్చలేదు. కానీ రైటర్గా పని చేద్దామని వచ్చిన  వెన్నెల కిషోర్ నచ్చడంతో ఈ సినిమాలో  దర్శకుడు వెన్నెల కిషోర్ ని నటించమని అడిగాడు. దీంతో ఈ సినిమాలో ఖాదర్ పాత్రను పోషించాడు వెన్నెల కిషోర్. ఇక వెన్నెల కిషోర్ నటించిన ఇంకోసారి సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మహేష్ బాబుతో నటించిన దూకుడు తో వెన్నెల కిషోర్ క్రేజ్  ఎక్కడికో వెళ్ళి పోయింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు వెన్నెల కిషోర్.

మరింత సమాచారం తెలుసుకోండి: