క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. నిజానికి మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని తేలిపోయిన రోజు చంద్రబాబు ఎంతగా కుమిలిపోయుంటాడో ఇపుడు కూడా ఇదే విధంగా కుమిలి పోతున్నట్లున్నాడు.             జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ఏకంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీయే స్వయంగా అమరావతికి రావటమన్నది చంద్రబాబు కలలో కూడా ఊహించుండరు. కలలో కూడా ఊహించనిది నిజంగానే జరిగిపోయేటప్పటికి చంద్రబాబు అండ్ కో అస్సలు తట్టుకోలేకపోతున్నారు.

 

మొన్నటి వరకూ తనకేదైనా ఆపద వస్తే ముఖేష్ ఉన్నాడని చంద్రబాబు చాలా ధైర్యంగా ఉండేవాడనే ప్రచారం ఈనాటివి కావు. చంద్రబాబు-ముఖేష్ అంబానీ మధ్య బంధం ఫెవికాల్ అంత గట్టిగా ఉందని చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రచారం అందరికీ తెలిసిందే. నరేంద్రమోడి, అమిత్ షా లతో  చంద్రబాబుకు ఏదైనా అవసరం వస్తే ముఖేష్ ఉన్నాడు కాపాడటానికి అనే ప్రచారం టిడిపి సర్కిళ్ళల్లోనే జరిగేది.

 

అలాంటిది ముఖేషే వచ్చి జగన్ తో భేటి అయ్యాడంటే ఇక వాళ్ళ బాధ చెప్పేదేముంది ? చంద్రబాబు కోట నిజంగా ఇపుడే బద్దలైనట్లుంది చూడబోతుంటే. ఈ విషయం ఎల్లోమీడియా రాతల్లోను టిడిపి నేతల మీడియా సమావేశాల్లోను స్పష్టంగా కనబడిపోతున్నాయి. అప్పుడెప్పుడో తన తండ్రి వైఎస్సార్ మృతికి రిలయన్సే కారణమంటూ ఆరోపణలు చేసిన జగన్ ఇపుడు ముఖేష్ తో ఎలా భేటి అవుతారని ? ఎలా కాస్ల్టీ శాలువా కప్పుతారని, ఖరీదైన మెమొంటో ఎలా ఇస్తారంటూ పనికిమాలిన ప్రశ్నలు వేయటంలోనే తెలిసిపోతోంది వాళ్ళ అక్కసంతా.

 

జగన్ కు ముఖేష్ కు ఏమైనా సమస్యలుంటే వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు. మధ్యలో పచ్చబ్యాచ్ కొచ్చిన సమస్యేంటో అర్ధం కావటం లేదు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లుగా వాళ్ళిద్దరికీ లేని బాధ తమ్ముళ్ళకెందుకు ? అయినా జగన్ ఆరోపణలు చేసినపుడు కేవలం ప్రతిపక్ష నేత మాత్రమే. కానీ ఇపుడు అధికారంలో ఉన్నాడు. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను కలవటం ప్రభుత్వాధినేతగా జగన్ బాధ్యత. ఇంతమాత్రం ఇంగితం కూడా లేకుండా మాట్లాడుతున్నారో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: