వైసీపీ అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. జగన్ ఇమేజ్ కి తోడు ఎన్నో ఇతరమైన అంశాలు కీలక భూమికను పోషించాయి. అయితే జగన్ ముఖ్యమంత్రి కాగానే వైసీపీ శ్రేణులు మొదట నిద్రపోయారు. ఇపుడు మిగిలిన వింగులు కూడా ఒక్కోటిగా నిద్రావస్థలోకి చేరుకుంటున్నాయి. ఫలితంగా జగన్ సర్కార్ మీద టీడీపీ బురదజల్లుడు హైలెట్ అవుతోంది. దాంతో విమర్శల  జడివానలో కొత్త సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

 

నాడు ప్రతిపక్ష నేత  జగన్ కి అసలైన బలంగా వైసీపీ  సోషల్ మీడియా నిలిచింది. జగన్ని నాడు మెయిన్ స్ట్రీం మీడియా బాగా వ్యతిరేకించి పుంఖానుపుంఖాలుగా పేజీలకు పేజీలు అచ్చేసినా కాపాడింది, రక్షణ వలయంగా  నిలిచింది కచ్చితంగా సోషల్ మీడియానే. సోషల్ మీడియా దెబ్బకే టీడీపీ సర్కార్ పతనమైంది. దాని పవర్ తెలుసుకునేసరికి పచ్చ పార్టీ ప్రభుత్వం పక్కకు పోయింది.

 

మరి అంత పదునైన అస్త్రంగా సోషల్ మీడియా వింగ్ ఉంటే దాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చాక అసలు పట్టించుకోవడంలేదు. అందులో  ఉన్న వారు సైతం నిస్తేజమైపోయారు. ఇపుడు సోషల్ మీడియాను సగానికి పైగా టీడీపీ ఆక్రమించేసింది. అది చాలదన్నట్లుగా వారికి మరిన్ని కొత్త క్లాసులు పెట్టి మరీ మెలకువలు నేర్పే పనిలో టీడీపీ పెద్దలు ఉన్నారు.

 

విశాఖలో చంద్రబాబు గో బ్యాక్  ఎపిసోడ్ ని సక్సెస్ ఫుల్ గా జనంలోకి తీసుకువెళ్ళి బోలెడంత సింపతీ తీసుకురావడంతో సోషల్ మీడియా చాలా పెద్ద పాత్ర పోషించింది.  ఇక వైసీపీ ఎన్ని మంచి పనులు చేస్తున్నా చెప్పుకోవడానికి ఆ పార్టీ వింగ్ ఎందుకో ముందుకు రావడంలేదన్న విమర్శలు ఉన్నాయి.

 

పించన్లు సెలవు రోజు అయిన ఆదివారం కూడా రికార్డు స్థాయిలో ఇవ్వడం, ఇంటింటికీ తిరిగి ఇవ్వడం, లబ్దిదారుడు పొలంలో ఉన్నా, గుళ్ళో ఉన్నా కూడా వెళ్ళి మరీ ఇవ్వడం అన్నది దేశంలోనే కొత్త రికార్డు, కోడి కూతకు ముందే ఇంటి తలుపు తట్టి డబ్బులు ఇచ్చిన వైసీపీ సర్కార్ ఘనతను ఎంత ఎక్కువగా ప్రచారం చేసుకున్నా తక్కువే. 

 

కానీ ఇక్కడే వైసీపీ సోషల్ మీడియా వింగ్ సైలెంట్ అయిపోయింది. అదే సమయంలో ఎక్కడో అందని పించన్లు ఒకటీఅరా ఉంటే వాటిని పట్టుకు పచ్చ పార్టీ సోషల్ మీడియా హైలెట్ చేసి పారేసింది. దాంతో అది జనంలోకి పోయింది. ఇదే తీరుగా వైసీపీ సోషల్ మీడియా  వింగ్ ఉంటే మాత్రం ఎన్ని మంచి పనులు చేసినా జగన్ సర్కార్ వ్యతిరేకతే మూటకట్టుకుంటుందని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: