ఫిబ్రవరి 10వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న పదహారేళ్ల రాధిక హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఇంట్లో అద్దెకు ఉంటున్న ఒక కుర్రాడు ఆమెని చంపేసి ఉంటాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలపగా అతని కోసం 75 మంది పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి వెతికినా అతను దొరకలేదు. దీంతో హత్య జరిగి కొన్ని వారాలు గడుస్తున్నా ఆమెను ఎవరు చంపారో తెలియక ఈ కేసు ఒక మిస్టరీగా మారింది.

 

 

అయితే పోలీసులు కుటుంబ సభ్యుల కాల్ డేటా, రాధిక ఫోన్ కాల్స్, పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించగా... ఈ హత్యలో కుటుంబ సభ్యుల పాత్ర ఉందని అనుమానం వచ్చింది. అయితే రాధిక తండ్రి కొమరయ్య ని విచారించిన పోలీసులు ఆదివారం వెంకటేశ్వర కాలనీలోని హత్య జరిగిన ఇంట్లో సీన్ రికన్స్ట్రక్షన్ నిర్వహించి కొన్ని కీలకమైన ఆధారాలను, నిజాలను కనుగొన్నారు. ఇంటిలో అద్దెకు ఉన్న యువకుడు ఈ హత్య చేయలేదని రాధికకు బాగా తెలిసిన వాళ్లు లేదా కుటుంబ సభ్యులు హత్య చేశారని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈరోజు కరీంనగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసే కీలకమైన ఆధారాలను, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ తండ్రే లేదా కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని తెలిస్తే అసలు ఆ హత్య చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో పోలీసులు ప్రశ్నలడుగుతారని తెలుస్తుంది.

 



కరీంనగర్ జిల్లా లోని విద్యానగర్ లో నివశిస్తున్న రాధిక తన ఇంట్లో నే ఫిబ్రవరి 10వ తారీఖున హత్య చేయబడింది. కూలి పనులకు వెళ్లిన తన తల్లిదండ్రులు రాధిక హత్యకు గురైనట్లు తెలుసుకొని ఇంటికి హుటాహుటిన తరలివచ్చారు. ఆ తర్వాత సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని... రాధికా ని పరిశీలించగా ఎవరో ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత 21 రోజులు దర్యాప్తు చేసిన పోలీసులు... కుటుంబ సభ్యులు హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: