చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వీళ్ళ నలుగురికి రెండుసార్లు ఉరిశిక్ష పడి తేదీలు కూడా ప్రకటించారు. కానీ మళ్ళీ మళ్ళీ శిక్ష వాయిదా పడుతునే ఉంది. న్యాయస్ధానం విధించిన ఉరిశిక్షపై వీళ్ళు పెట్టుకున్న అభ్యర్ధనను రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ తిరస్కరించిన తర్వాత కూడా శిక్ష అమలులో జాప్యం ఏమిటో అర్ధం కావటం లేదు. మొదట జనవరి 22వ తేదీని ఉరిశిక్షగా చెప్పారు. తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ అన్నారు. మళ్ళీ మార్చి 3వ తేదీ అంటున్నారు. మరోవైపు సుప్రింకోర్టులో విచారణ మొదలవుతోందంటే ఏమనర్ధం ?

 

ఇక్కడ విషయం ఏమిటంటే  వీళ్ళ తరపున వాదిస్తున్న లాయర్లు మోకాలికి బోడి గుండుకు ముడేసే ప్రయత్నాలు చేస్తున్నారు.  దీనికి కారణాలేమిటంటే న్యాయ వ్యవస్ధలోని లొసుగులే అని అర్ధమవుతోంది. లేకపోతే పాఠియాల కోర్టు ఉరిశిక్ష వేసింది. తర్వాత చాలా కోర్టులు తిరిగి ఢిల్లీ హై కోర్టు  కూడా ఉరిశిక్షనే ధృవీకరించింది. ఆ తర్వాత ఏదో కారణం చెప్పి రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటీషన్ పెట్టుకున్నారు. ఆ తర్వాత మరేదో కారణం చెప్పి మళ్ళీ సుప్రింకోర్టులో క్యురేటివ్ పిటీషన్లని ఇంకోటని ఏదో ఓ పద్దతిలో  కాలయాపన చేస్తునే ఉన్నారు.

 

తమ క్లైంట్లకు ఉరిశిక్ష పడకుండా తప్పించటమే వీళ్ళ తరపున లాయర్ల ముఖ్య ఉద్దేశ్యంగా కనబడుతోంది. సరే లాయర్లుగా  వీళ్ళ కృషి అభినందనీయమే. కానీ సామాజిక బాధ్యతగా తాము  చేస్తున్నదేమిటి ? అని లాయర్లు తమను తామే ప్రశ్నించుకోవాలి.  వీళ్ళు చేసిన హత్యాచారం దేశంలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసి కూడా వీళ్ళను కాపాడటానికి లాయర్లు పడుతున్న కష్టం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళకి పడిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారిస్తే  ఓ పదేళ్ళకు బయటకు వచ్చేయటం ఖాయం. బయటకు వచ్చిన తర్వాత  మళ్ళీ అదే పని చేస్తే ? ..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: