ఈ రోజుల్లో పిల్లల అల్లరి హద్దులు దాటుతుంది. వారి విపరీత అల్లరి చేష్టల వలన ఇరుగుపొరుగు ప్రజలకే కాకుండా అల్లరి చేసే ఆకతాయిలకు కూడా హాని జరుగుతుంది. డ్రైవింగ్ రాకపోయినా బైకులను ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్పీడుగా నడపటం, రోడ్లమీద కొట్టుకోవడం ఇలా ఇంకా ఎన్నో అల్లరి పనులను చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించడం నేటి యువకులకు బాగా అలవాటైపోయింది.




అయితే ముంబై మహానగరంలోని ఘాట్కోపర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అల్లరిమూక తమ ఇళ్ల పక్కన నివసిస్తున్న 68ఏళ్ల వృద్ధుడైన హిమ్మత్ గోహిల్ ని తరచూ ఆట పట్టించేవారు. అతడిపై ప్రాంకులు గట్రా చేస్తూ ఆ వృద్ధుడిని బాగా విసిగించేవారు. వారి అల్లరి భరించలేక ఆ వృద్ధుడు అప్పుడప్పుడు వారిని దూషిస్తూ కొట్టే వాడు. అయినా వారి అల్లరి మాత్రం అణువంత అయినా తగ్గలేదు. ఐతే శనివారం శివ శంబు పవార్ అనే 14 ఏళ్ల కుర్రాడు హిమ్మత్ గోహిల్ కాలి చెప్పులను దాచి పెట్టాడు. తన చెప్పులు కనిపించకపోవడంతో హిమ్మత్ తన ఇల్లంతా, ఇంకా ఇంటి చుట్టుపక్కల కూడా వెతికాడు. కానీ ఎంత వెతికినా దొరకలేదు. దీంతో ఈ పని అల్లరి కుర్రాళ్లు చేసి ఉంటారని వారిని అడగడానికి వెళ్లగా మేము తీయలేదు అంటే మేము తీయాలేదని చాలా మంది చెప్పారు. దీంతో హిమ్మత్ ఇంటికి తిరిగి వచ్చేశాడు.



అయితే కొంత సమయం గడిచిన తర్వాత శివ శంబు పవార్ హిమ్మత్ ఇంటికి వచ్చి 'ఇదిగో నీ చెప్పులు. నేనే దాచిపెట్టా", అని అన్నాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హిమ్మత్ శివ ని ఇంటి లోపలికి లాక్కెళ్లి కొడుతూ గొంతు గట్టిగ పిసికాడు. దీంతో ఊపిరాడక శివ శంబు ప్రాణాలు విడిచాడు. ఇది తెలుసుకున్న స్థానికులు శివ కుటుంబ సభ్యులను పిలిచారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి తమ కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లగా... అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు. దీంతో కంటతడి పెడుతూ తన కొడకుని చంపేసిన హిమ్మత్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మృతుడి తండ్రి.




ప్రస్తుతం నిందితుడు హిమ్మత్ గోహిల్ ని ఐపీసీ సెక్షన్ 302(a) కింద అరెస్టు చేసే విచారిస్తున్నారు పోలీసులు. వారి అల్లరి తట్టుకోలేక కోపంలో ఈ పని చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. శివ కి శవ పరీక్ష నిర్వహించగా.. అతడు ఊపిరాడక చచ్చిపోయాడని తేలింది. పోస్ట్ మార్టం అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఏదేమైనా హిమ్మత్ క్షణికావేశంలో ఒక నిండు ప్రాణాన్ని తన చేతులారా తీసేసి జైలు పాలయ్యాడు. శివ శంబు పవార్ తన లిమిట్స్ లో తను ఉన్నట్లయితే ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: