తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంట్లో నుంచే మీ సేవ సర్వీసులను కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండటంతో ప్రజలకు ఇంటర్నెట్ సేవలు దగ్గరయ్యాయి. ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందించాలని మీ సేవా కార్యాలయాలను అందుబాటులోకి తెచ్చింది. 
 
ప్రజలు మీ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వ సేవలు, రెవెన్యూ, విద్యా సంబంధిత ధ్రువపత్రాలు, ఇతర సేవలను పొందవచ్చు. ప్రభుత్వం ప్రజలకు మీ సేవ సర్వీసులను విసృతం చేసేందుకు మీ సేవ కార్యాలయాల్లో వినియోగించుకునే సేవలను ఇంటి నుంచే పొందేందుకు అవకాశం కల్పించింది. నగరాల్లో, పట్టణాల్లో చాలా మంది ప్రజలు మీ సేవా సెంటర్లు ఎక్కడ ఉన్నాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఇకనుండి ఇంటర్నెట్ ద్వారా కొన్ని మీ సేవ సర్వీసులను పొందవచ్చు. సిటిజన్ పోర్టల్ ద్వారా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. పోర్టల్ ద్వారా జనన ధ్రువీకరణ పత్రాలు, ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునే సదుపాయం, కరెంట్ బిల్లుల చెల్లింపు, కుల, నివాస, ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలు.. ఇతర సేవలు అందుబాటులో ఉంటాయి. డెబిట్, క్రెడిట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రతి సేవకు నిర్దేశిత రుసుము చెల్లించాలి. 
 
ఇంటి నుండే మీ సేవ సర్వీసులను ఉపయోగించుకోవాలనుకునే వారు https://ts.meeseva.telangana.gov.in/meeseva/home.htm వెబ్ సైట్ ఓపెన్ చేసి మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లాగిన్ అయ్యే సమయంలో సిటిజన్ అనే ఆప్షన్ ను ఎంచుకుని యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ద్వారా లాగిన్ కావాలి. ఆ తరువాత అందుబాటులో ఉన్న సేవలలో అవసరమైన వాటిని ఎంచుకుని వివరాలను, నమోదు చేసి సేవలు ఉపయోగించుకోవచ్చు.                           

మరింత సమాచారం తెలుసుకోండి: