జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు.  ఒకవైపు సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతూనే మరోవైపు ప్రజలకు కావాల్సిన అన్ని విషయాలు చూసుకుంటున్నారు. జగన్ పై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ వాటిని తట్టుకొని నిలబడి ముందుకు వెళ్తున్నారు.  రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికీ ఉన్న నిధులను వినియోగించుకుంటూ ప్రజారంజకంగా పాలన చేస్తున్నారు.  

 


ఇదిలా ఉంటె, దేశంలో సిఏఏ పై అనేక విమర్శలు వస్తున్నాయి.  చాలామంది సిఏఏ ను వ్యతిరేకిస్తున్నారు.  సిఏఏ వలన ప్రజలు ఇబ్బందులు పడతారని, సిఏఏ వలన మైనారిటీలకు ఇబ్బందులు వస్తాయని దీనిని కేంద్రం ఉపసంహరించుకోవాలని కొన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి.  ఇందులో భాగంగానే కేసీఆర్ కూడా దీనిని వ్యతిరేకించారు.  దీనిపై కేబినెట్ కూడా తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.  

 


కేంద్రం తీసుకొచ్చే సిఏఏ ను రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నది.  తెలంగాణలో తీర్మానం ప్రవేశపెడుతున్నారు కాబట్టి దీనిని ఏపీలో కూడా ప్రవేశపెట్టి సిఏఏ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని జగన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.  సిఏఏ ను అమలు చేయడం వలన మైనారిటీలు ఇబ్బందులు పడతారని అంటున్నారు.  అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు కేంద్రం సపోర్ట్ చాలా అవసరం.  


దీంతో జగన్ అందుకు అంగీకరిస్తారా లేదా అన్నది చూడాలి. జగన్ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  ఇప్పటి వరకు సిఏఏ విషయంలో జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.  కానీ వైకాపాకు చెందిన మైనారిటీ ఎమ్మెల్యేలు ముస్తఫా, అంజాన్ భాషాలు మాత్రం జగన్ పై ఒత్తిడి తీసుకొచ్చి సిఏఏ పై తీర్మానం ప్రవేశపెట్టేలా చేస్తామని అంటున్నారు.  ఇప్పుడు ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  జగన్ ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: