తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నా ఆ పార్టీ నాయకుల్లో మాత్రం ఎక్కడా మార్పు అయితే కనిపించడంలేదు. పార్టీని టీఆర్ఎస్ కు ధీటుగా తీర్చిదిద్దాలనే వ్యూహాం, ఆలోచన కానీ ఆ పార్టీ నాయకుల్లో కనిపించడంలేదు. కేవలం ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ, ఆధిపత్యం చెలాయించేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పార్టీ పరిస్థితిని మరింతగా దిగజారుస్తున్నారు. ఇక అధిష్టానం కూడా నాయకుల తీరుతో విసుగుచెందింది. ఇది ఇలా ఉంటే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలాకాలంగా పార్టీ నాయకుల్లో పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతూ ఒకరి మీద ఒకరు బురద జల్లుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో అందరికంటే ముందు వరుసలో ఉన్న రేవంత్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ అధ్యక్ష పీఠం దక్కకుండా మిగతా సీనియర్ నాయకులు మంత్రంగం నడిపిస్తున్నారు. 

IHG


మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రేవంత్ విషయంలో కఠినంగానే ఉంది ఆయన ప్రస్తుతం పట్నం గోష యాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆయనపై భూ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి ఆయన మీద కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపైనా   రేవంత్  టీఆర్ఎస్  ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం రేవంత్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా మాటల  యుద్ధం నడుస్తోంది. ఈ విషయంలో రేవంత్ కు మద్దతగా మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పీఠం దక్కకుండా కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. రేవంత్ మీద కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి ఆయనకు పదవి ఇవ్వొద్దు అంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.    


ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీమంత్రి శ్రీధర్ బాబు వంటి నాయకులు టీ పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అయితే ఈసారి టీ పీసీసీ చీఫ్ పదవి తనకే దక్కుతుందన్న ధీమాలో రేవంత్ రెడ్డి ఉండగా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు రేవంత్ కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారు. గతంలోనూ ఆయన మీద ఉన్న ఓటుకి నోటు కేసు వ్యవహారాన్ని కూడా ఇప్పుడు హైలెట్ చేసి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తుండడంతో రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కదు అంటూ కొంతమంది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: