ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ సినిమా అయినా ఖైదీ నెంబర్ 150 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సైరా నరసింహారెడ్డి మాత్రం చిరంజీవికి అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది. దీంతో తన నెక్స్ట్  సినిమాపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాను ఎలాగైనా భారీ రికార్డు సృష్టించేలా ఎన్నో  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న  సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 అయితే కొరటాల సినిమాలు అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు గా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కొరటాల సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం మెగా అభిమానులందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ దర్శకుడు కొరటాల శివ మాత్రం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కటి  కూడా బయటికి లీక్ కాకుండా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్ పోషిస్తున్నారు అని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ కు సంబంధించి కూడా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఒక మంచి సమయం సందర్భం చూసుకుని ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ప్రకటించాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ వేశారు. కానీ అది కాస్త వృధా అయినట్లు తెలుస్తుంది.

 

 

 ఇందుకు  కారణం మరెవరో కాదు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి. గోవింద ఆచార్య గా ఈ సినిమా టైటిల్ కు సంబంధించి కొన్ని పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి... కానీ దీనిపై చిత్రబృందం  నుంచి ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. ఓ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి... మాటల్లో  పొరపాటుగా తన నెక్స్ట్ సినిమా టైటిల్ ఆచార్య అని అనౌన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ టైటిల్ గురించి ఒక క్లారిటీ వచ్చేసింది. దీంతో టైటిల్ ను రివీల్  చేసి మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ కు భారీ షాక్ ఇచ్చాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: