నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలవుతుందా? మళ్లీ వాయిదా పడుతుందా? దేశవ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. అయితే  ఉరిపై స్టే విధించేందుకు పాటియాలా కోర్టు నిరాకరించడంతో.. శిక్ష అమలుపై ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.

 

ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ అత్యాచారం, హత్యకేసులో.. దోషులకు ఉరిశిక్షపడే సమయం దగ్గపడుతోంది. అయితే, దోషులు మాత్రం న్యాయపరమైన లొలుసుగులతో శిక్షను తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీంతో ఈసారైనా ఉరిపడుతుందా? మళ్లీ వాయిదా పడుతుందా? అనే సందిగ్ధత కొనసాగుతోంది.

 

అయితే నిర్భయ దోషులు చేస్తున్న ఈ ప్రయత్నాలకు పాటియాలా కోర్టు చెక్‌ పెట్టింది. శిక్ష అమలుకు సరిగ్గా ఒకరోజు ముందు దోషులు పవన్‌, అక్షయ్‌ పెట్టుకున్న పిటిషన్లను కోర్టు కొట్టేసింది. వారు ఉరిశిక్షపై స్టే విధించాలని  కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. అంతకు ముందు ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ పవన్‌ గుప్తా వేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది.

 

మార్చి 3న నిర్భయ దోషులను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు.. ఇటీవల డెత్ వారెంట్ జారీ చేసింది. అయితే ఉరికి సమయం దగ్గర వేళ దోషి అక్షయ్‌ శుక్రవారం మరోమారు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నాడు. క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున డెత్‌ వారెంట్‌పై స్టే విధించాలన్న అక్షన్‌ వాదనను కోర్టు తోసిపుచ్చింది.  

 

రేపు ఉదయం 6 గంటలకే దోషులకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే ఢిల్లీ కోర్టు, సుప్రీం కోర్టుల్లో నిందితులు పిటిషన్లు వేశారు. తన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని సుప్రీం కోర్టులో పవన్‌గుప్తా పిటిషన్‌ వేయగా.. క్యూరేటివ్‌ పిటిషన్‌‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. అలాగే తమ క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని.. డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ  పవన్ కుమార్, అక్షయ్ సింగ్ పాటియాల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. స్టే విధించేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఉరిశిక్ష అమలుపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. దోషులకు రేపు ఉరి అమలు చేయనున్నారు. ఇదిలా ఉంటే పాటియాల కోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు, ప్రజా సంఘాలనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: