ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ తరహాలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన చరిత్ర లేదు. సాధారణంగా ప్రభుత్వాలు ఎన్నికల ఏడాదిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటారు. కాని జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే అప్పో సొప్పో చేసి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నారు. అమ్మ ఒడి, విద్యా వసతి దీవెన, రైతు భరోసా వంటి కార్యక్రమాలతో జగన్ ఇప్పుడు ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఇది పక్కన పెడితే సంక్షేమ కార్యక్రమాల ముసుగులో ప్రజల నుంచి భారీగా ప్రభుత్వం వసూలు చేయడం మొదలుపెట్టింది అంటున్నారు. ఆటో వాళ్లకు పది వేలు ఇచ్చి ఇప్పుడు పెట్రో, డీజిల్ ధరలను భారీగా పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి తోడు వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇకపోతే నిత్యావసర వస్తువుల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దానికి తోడు గతంలో ఇసుక ఫ్రీ గా ఉండేది. ఇప్పుడు ఇసుక భారీగా పెరిగిపోయింది అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇక మద్యం ధరలు ఇప్పుడు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మద్యపాన నిషేధం అంటే రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని నిషేధించాలి. అలా కాకుండా ధరలు పెంచడం కాస్త ఆశ్చర్యంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇలా ఒక రూపంలో ఇస్తూ మరో రూపంలో వసూలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. త్వరలో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందీ అనేది నిపుణుల అంచనా. ఈ ధరలను పెంచుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంచనా వేయలేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. 

 

ఆర్టీసి చార్జీలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ వాటిని పెంచే అవకాశం ఉంది. అలాగే పెట్రోల్ ధరల విషయంలో ఇప్పటికి రెండు సార్లు పెంచి సవరణ అని చెప్పుకుంది ఏపీ సర్కార్. ఇలా ఏ విధంగా చూసినా సరే ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా భారం మోపుతూనే ఉంది. తిరుమల విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తుంది ఏపీ సర్కార్. ఇప్పటికే ఆదాయం లేక, ఉపాధి అవస్థలు పడుతున్నారు. విద్యుత్ చార్జీలను కూడా పెంచుతూ మొన్నీ మధ్య ఉత్తర్వ్యులు ఇచ్చింది. సంక్షేమ పథకాల అర్హులను కూడా ఆ కారణం ఈ కారణం చెప్పి తప్పిస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: