ప్రపంచ ధనవంతుల లో ఒకరు రిలయన్స్ అధినేత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ స్వయంగా అమరావతి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటికి వెళ్లడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దాదాపు గంటకు పైగానే వీరిద్దరి భేటీ జరగటం ఇప్పుడు సంచలనంగా మారింది. కాగా వీళ్ళిద్దరి బేటీ గురించి రకరకాల వార్తలు మరోపక్క వస్తూనే ఉన్నాయి. అయితే అసలు వీళ్ళు ఇద్దరు కలసి సమావేశం అవడానికి చక్రం తిప్పింది ఎవరు అనే దాని గురించి చర్చించిన సమయంలో విజయసాయిరెడ్డి పేరు బయటకు రావటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

వైసీపీ పార్టీకి సంబంధించి కీలక విషయాలను ఢిల్లీలో ఉండి చూసుకునే విజయ సాయి రెడ్డి త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరిమళ్ ధీరజ్ నత్వానీ టర్మ్ ముగుస్తున్న క్రమంలో  ఈ భేటీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే పరిమళ్ ధీరజ్ నత్వానీ ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభకు ఎంపిక కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మూడోసారి కూడా రాజ్యసభకు వెళ్లాలని డిసైడ్ అవ్వడం తో ఆయన కన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నాలుగు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అంతేకాకుండా మొత్తం సీట్లు వైసీపీ కే దక్కుతున్నాయి. ఇందువలన ఒక సీటును అధ్యక్షుడు వైయస్ జగన్ ని అడిగి తీసుకోవాలని పరిమళ్ ధీరజ్ నత్వానీ జగన్ తో భేటీ కావడం జరిగిందట.

 

అయితే వీరిద్దరి బేటీ వల్ల రాష్ట్రానికి వచ్చే లాభమేంటి అనుకుంటే, నత్వానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కి నమ్మినబంటు. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి అవసరం మరోపక్క అంబానీ కి రాజ్యసభ సీటు అవసరం ఏ ప్రాతిపదికన ముకేశ్ అంబానీ మరియు జగన్ భేటీ దగ్గరుండి విజయసాయిరెడ్డి చూస్తున్నారట. దీంతో దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో ఏపీ లో వేల కోట్లు పెట్టడానికి ముఖేష్ అంబానీ ఓకే చెప్పారట. దీంతో ఏపీలో పెట్టుబడులకు రావటానికి కారణమైన విజయసాయిరెడ్డికి ఆ క్రెడిట్ మొత్తం దక్కాలని మీటింగ్ అయిపోయిన తర్వాత వైసిపి పార్టీ పెద్దలతో జగన్ అన్నట్లు వైసిపి పార్టీలో టాక్. దీంతో ఈ గుడ్ న్యూస్ విజయసాయిరెడ్డి చెవిలో పడగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అంట.

మరింత సమాచారం తెలుసుకోండి: