ఇటీవ‌ల కాలంలో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ దందా కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ మోసాలకు పాల్పడే వారిలో అధిక శాతం బయటి రాష్ట్రాలకు చెందినవారు కావడంతో వీరి ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సవాల్‌గా మార‌తోంది. ఆన్‌లైన్‌లో ఫోన్‌ నంబర్లు పెడుతూ విదేశాల నుంచి యువతులను రప్పించి గుట్టుచప్పుడుకాకుండా ఎంద‌రో వ్య‌భిచార గృహాలు న‌డుపుతున్నారు. ఇక తాజాగా గుజరాత్‌లోని వడోదరలో మరో ఆన్‌లైన్‌ సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన యువతులతో వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాను ఆన్‌లైన్ సెక్స్ రాకెట్‌ను స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు పట్టుకున్నారు.

 

ఈ క్ర‌మంలోనే ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు నలుగురు సెక్స్ వర్కర్లకు విముక్తి కల్పించారు. పూర్తి వివ‌రాల్లోకి.. Highest Standard Call Girls Escort service Vadodara’ మరియు ‘Oklute’ అనే రెండు వెబ్‌సైట్ల ద్వారా వ్యభిచార నిర్వాహకులు ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ దందా నిర్వహిస్తున్నారు. ఇది తెలుసుకున్న పోలీసులు వారిపై నిఘా పెట్టారు. ఈ నేప‌థ‌యంలోనే ఆ వెబ్‌సైట్ల‌లో పేర్కొన్న ఫోన్ నంబర్లతో సెక్స్ రాకెట్ నిర్వహకులను సంప్రదించారు. ఒక్కో అమ్మాయికి పగటిపూట అయితే రూ.6వేలు, రాత్రి సమయంలో రూ15వేలు అని నిర్వాహకులు చెప్పారు. దీంతో పోలీసులు  ఓ కానిస్టేబుల్‌ను విటుడిగా వ్యభిచార కేంద్రానికి పంపించారు. 

 

ఇక ప్లాన్ ప్ర‌కారం.. అతడు వారి దగ్గరికి వెళ్లి బేరం మాట్లాడుకుని అమ్మాయితో కలిసి గదిలోకి వెళ్లాడు. ఇంత‌లోనే  పోలీసులు అక్కడికి చేరుకుని రైడ్ చేసి.. వారి గుట్టు ర‌ట్టు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమ్రేలీకి చెందిన నితిన్ వాలా, ఢిల్లీకి చెందిన సందీప్‌కుమార్, మధ్యప్రదేశ్‌కు చెందిన హిరాగ్ పటేల్, వడోదరకే చెందిన సంజయ్‌కుమార్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. అయితే సూరత్‌కు చెందిన వినోద్ పటేల్, పంజాబ్ నివాస్ అరవింద్ శర్మ పరార‌యిన‌ట్టు తెలుస్తోంది. ఇక అక్క‌డ ప‌ట్టుబ‌డ్డ.. నలుగురు సెక్స్‌ వర్కర్లను అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రానికి తరలించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: