టీడీపీలో ఫైర్ బ్రాండ్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. బెయిల్‌ పై విడుదలైన చింతమనేని మీడియాతో మాట్లాడుతూ.. తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారని ఆవేదన చెందారు. ఎస్సీ, ఎస్టీ యాక్టును దుర్వినియోగం చేస్తున్నారని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. దళితులతో తాను ఉన్నంత చనువుగా మరే అగ్రకుల నాయకుడు కూడా లేడని.. కావాలంటే నియోజకవర్గంలోని గ్రామాలకు వెళ్లి అడగాలంటూ సవాల్ చేశారు. దళిత వ్యతిరేకి చింతమనేని ప్రభాకర్ అని ముద్ర వేసేందుకు జరిగిన కుట్రలో ఇదొక భాగమేనని అన్నారు.

 

 

అయితే.. గత ఎన్నికల ముందు చింతమనేని దళితులను దూషిస్తున్నట్లు ఉన్న వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో దళిత వ్యతిరేకిగా ముద్రపడ్డ చింతమనేని ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో గత టీడీపీ ప్రభుత్వంలో వివాదాస్పద ఎమ్మెల్యే గా పేరు గాంచిన చింతమనేని ఓటమి అనంతరం సైలెంట్ అయిపోయారు. అయితే దళితులను దూషించినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సహా 18 కేసుల్లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చింతమనేనిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. 

 

 

చింతమనేని ప్రభాకర్ దళితవాడల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వాస్తవానికి దెందులూరు నియోజకవర్గంలో చింతమనేనికి దళితవర్గాల్లోనే ఎక్కువ మద్దతు ఉండేది. కానీ, ఎన్నికల ముందు దళితులను దూషిస్తున్నట్లు ఉన్న వీడియో ఆయన ఇమేజ్‌ ను దారుణంగా దెబ్బతీసింది. చింతమనేని పరాజయానికి ఒకరకంగా కారణమైంది. ఈ నేపథ్యంలో దళిత వర్గాల అభిమానం చూరగొనేందుకు చింతమనేని మళ్లీ రంగంలోకి దిగారు. దళితవాడల్లో ఆయన జోరుగా పర్యటిస్తున్నారు.

 

 

 

ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా దెందులూరు మండలం తిమ్మన్నగూడెం, కండ్రిగ నర్సింహాపురం, మలకచర్ల, రామారావుగూడెం గ్రామాల్లో చింతమనేని ప్రజా చైతన్య యాత్ర సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దళితవాడల్లో పర్యటించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: