అధికారంలో రాగానే జగన్ ఏం చేసిన అది సంచలనమే అయింది. ఆయన తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే పథకాలు ఏదైనా గానీ సంచలనాత్మకంగానే చేశారు. ఇలా ఆయన అధికారంలోకి రాగానే మొదట్లో అమలు చేసిన సంచలన నిర్ణయం ఏదైనా ఉందంటే అది వాలంటీర్ల వ్యవస్థనే. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధం మరింత బలపడటానికి, వారి మధ్య వారథిలా పని చేయడానికి వాలంటీర్ల వ్యవస్థని తీసుకొచ్చారు. నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు వెంటనే ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు.

 

ఒక నెలలోనే నోటిఫికేషన్ వదిలి పట్టణాలు, గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ని నియమించారు. ఇక వారే ఆ 50 ఇళ్ల బాగోగులని చూసుకోవాలని చెప్పారు. అయితే ఈ వ్యవస్థని తీసుకొచ్చిన మొదట్లో అన్నివైపుల నుంచి విమర్శలు వచ్చాయి. వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. వీరి వల్ల అంతా నష్టమని మాట్లాడారు. దీనికి తోడు కొందరు వాలంటీర్లు ఉద్యోగాల్లో చేరిన మొదట్లో చేయలేక మానేశారు. అలాగే కొందరు వాలంటీర్లపై ఆరోపణలు కూడా వచ్చాయి. కొందరు పథకాలు కావాలంటే ప్రజల దగ్గర కమిషన్లు వసూలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

 

అయితే అలాంటివారిని ప్రభుత్వం ఉపేక్షించకుండా వెంటనే తీసేసింది. అలాగే పథకాలని పకడ్బందీగా అమలు చేసేలా ప్లాన్ చేసింది. అటు వాలంటీర్లకు కూడా పని అలవాటు చేసుకోవడానికి సమయం పట్టింది. నిదానంగా ఇంప్రూవ్ అయ్యి, ఇప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. వారి వల్లే పనులు త్వరగా అవుతున్నాయి. తాజాగా కూడా ఒక్కరోజులోనే లబ్దిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించారు.

 

పైగా మార్చి 1 మధ్యాహ్నానికే 80 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తిచేసి శభాష్ అనిపించుకున్నారు. ఏదేమైనా కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ్యత ప్రజలకు తప్పించిన వాలంటీర్లు గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంతకష్టపడుతున్న వారికి జీతం 5వేలు అనేది కాస్త తక్కువగానే అనిపిస్తుంది. మొత్తానికైతే మొదట్లో వాలంటీర్ వ్యవస్థ మీద ఉన్న నెగిటివ్ పోయి, ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: